E-Paper
Advertisement

Himalayas: మన హిమాలయాలకు అరుదైన గుర్తింపు.. టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్!

Himalayas: మన హిమాలయాలకు అరుదైన గుర్తింపు.. టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్!
Advertisement

మరో నెల రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో పలువురు..  క్రేజీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఏ దేశానికి వెళ్లాలా? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ ట్రావెల్ కీలక విషయాలను వెల్లడించింది.  2026 టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్ లిస్టును విడుదల చేసింది. ఇందులో హిమాలయాలకు టాప్ ప్లేస్ ఇచ్చింది. ఇప్పటికే మొదలైన బుకింగ్‌లు, ట్రావెల్ నిపుణులు అభిప్రాయాల ప్రకారం ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో అందమైన, తక్కువ రద్దీగా ఉండే పర్వత ప్రాంతాల ఆకర్షణను హైలైట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్,  ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలలోని హిమాలయాలు విభిన్న అనుభవాలను అందిస్తాయని తెలిపింది. ప్రయాణికులను తన సహజ సౌందర్యం,  సాంస్కృతిక గొప్పతనంతో ఎంతగానో ఆకర్షిస్తాయని వెల్లడించింది.

ప్రపంచంలోని టాప్ 10 డెస్టినేషన్స్

2026 లైనప్‌ లో మొత్తం 10 డెస్టినేషన్స్ ను టాప్ ఉన్నట్లు వెల్లడించింది. అందులో ఇండియా నుంచి హిమాలయాలు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. మిగతా ప్రాంతాలు ఇవే..

Advertisement

⦿ భారతీయ హిమాలయాలు

⦿ ఐర్లాండ్‌ లోని కిల్లర్నీ

Advertisement

⦿ యునైటెడ్ స్టేట్స్‌ లోని లాస్ వెగాస్

⦿ మొరాకో లోని మర్రకేష్

⦿ స్పెయిన్‌ లోని మార్బెల్లా

⦿ జపాన్‌ లోని ఒకినావా దీవులు

⦿ పనామా నగరం

⦿ కోస్టా రికాలోని పాపాగయో ద్వీపకల్పం

⦿ కొలరాడోలోని శాన్ జువాన్ పర్వతాలు

⦿ మాల్టాలోని సెయింట్ జూలియన్స్

ఈ గమ్యస్థానాలన్నీ సహజ సౌందర్యం, సంస్కృతిక వారసత్వం, అడ్వెంచరస్ మిక్సింగ్ తో ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటిలో హిమాలయాలు మరింత అద్భుతంగా ఉంటాయని అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ ట్రావెల్ వెల్లడించింది. ఇండియాలోని పర్వత ప్రాంతాలపై పెరుగుతున్న ప్రపంచ ఆసక్తిని హైలైట్ చేస్తుంది. ప్రపంచ జాబితాలో భారతీయ హిమాలయాల తర్వాత ఐర్లాండ్‌ లోని కిల్లర్నీ ఉంది. అద్భుతమైన  సరస్సులు, నేషనల్ పార్క్ లు, పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. దాని నడక మార్గాలు, చారిత్రాత్మక కోటలు, రింగ్ ఆఫ్ కెర్రీ వెంబడి ఉన్న అందమైన డ్రైవ్‌లు, నెమ్మదిగా నడిచే అనుభవాలను కోరుకునే ప్రయాణికులందరికీ ఎంతగానో నచ్చుతుంది. జాబితాలో మూడవది లాస్ వెగాస్. ఇది నైట్ లైఫ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. వినోదం, ఫుడ్, విలాసవంతమైన అనుభవాలను పొందవచ్చు.

హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు!

భారతీయ హిమాలయాల విషయానికొస్తే.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పర్వత ప్రాంతాలు. మంచుతో కప్పబడిన శిఖరాలు. పక్కనే లోయలు, ఎత్తైన ప్రకృతి దృశ్యాలు ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ విశాలమైన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఈ ప్రదేశాలన్నీ విభిన్న అనుభవాలను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, మనాలి లాంటి క్లాసిక్ హిల్ స్టేషన్స్ కు నిలయంగా ఉంది. లాహౌల్, స్పితి లాంటి  ఎత్తైన భూభాగాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాలు పర్వత దృశ్యాలు, ప్రశాంతమైన గ్రామాలు, పురాతన మఠాలు, దేశంలోని ఎత్తైన కనుమల ద్వారా డ్రమటిక్ డ్రైవ్‌ లతో ప్రయాణికులను ఆకర్షిస్తాయి.

ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక ఆకర్షణ మరింత హైలెట్ గా చెప్పుకోవచ్చు. కేదార్‌ నాథ్, బద్రీనాథ్‌ కు వెళ్లే మార్గాలు దేశంలోని అత్యంత భక్తితో కూడుకున్న డెస్టినేషన్స్ గా కొనసాగుతున్నాయి.  యాత్రికులు, యోగా సాధకులు, వెల్నెస్ కోరుకునేవారు రిషికేశ్, హరిద్వార్‌ కు వస్తారు. పువ్వులతో కూడిన లోయలు హైకర్లు, నేచురల్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.   హిమాలయ స్కీయింగ్ హాట్ స్పాట్ అయిన అయిన ఔలి వింటర్ లో సందర్శకులను సాదరంగా స్వాగతిస్తుంది.  సిక్కిం టీ తోటలు, ఎత్తైన సరస్సులు, తూర్పు హిమాలయాలలోని కాంచన్‌ జంగా పర్వతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన అందంతో ప్రశాంతమైన పర్వత పట్టణాల కోసం చూస్తున్న టూరిస్టులకు ఇది బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్యాంగ్‌ టక్, పెల్లింగ్, లాచుంగ్ కట్టిపడేస్తుంది.  అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్, జిరోలోని పురాతన మఠాలు, స్వదేశీ సంస్కృతులు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తాయి.

Read Also: భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×