E-Paper
Advertisement

The Raja saab: ది రాజా సాబ్ రన్ టైం లాక్.. రిస్క్ చేస్తున్న మారుతి?

The Raja saab: ది రాజా సాబ్ రన్ టైం లాక్.. రిస్క్ చేస్తున్న మారుతి?
Advertisement

The Raja Saab: ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas)హీరోగా మారుతి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “ది రాజా సాబ్”(The Raja Saab). ఈ సినిమా జనవరి 9, 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం వెల్లడించారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు సరైన విధంగా అప్డేట్స్ వెల్లడించని నేపథ్యంలో ఈ సినిమా విడుదలవుతుందా అనే సందేహాలను అందరూ వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం (Run Time)కూడా లాక్ చేశారని సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది.

3 గంటల 15 నిమిషాల నిడివి..

తాజాగా రాజా సాబ్ సినిమా రన్ టైంకి సంబంధించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు ఏకంగా
3 గంటల 15 నిమిషాల నిడివితో ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. ఇలా మూడు గంటల 15 నిమిషాలు అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ గా ఉంటే పర్లేదు కానీ ఏ మాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుందని ఇంత ఎక్కువ నిడివితో సినిమాని విడుదల చేస్తూ మారుతి రిస్క్ చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సినిమాకి రెండు గంటల 40 నిమిషాలు రన్ టైం ఉండి సినిమా ఆసక్తికరంగా ఉంటే తప్ప ప్రేక్షకులు ఓపికగా కూర్చుని సినిమాలు చూడడం లేదు.

రాజా సాబ్ కోసం బయ్యర్లు లేరా?

Advertisement

ఇక రాజా సాబ్ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ విషయంపై ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నిడివి గురించి సెన్సార్ బోర్డు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి పలువురు అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా బిజినెస్ పూర్తి కాలేదని, బయ్యర్లు కొనడానికి ముందుకు రాలేదని, అలాగే ఓటీటీ డీల్ కూడా పూర్తి కాలేదని అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై చిత్ర బృందం కూడా క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు.

ప్రభాస్ కు జోడిగా ముగ్గురు..

Advertisement

ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ముగ్గురు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తాత మనవడి బాండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ తాతయ్యగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్న విషయం తెలిసిందే.

Also Read: Tollywood: గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన సంక్రాంతి సినిమాలు .. ఈవెంట్స్ అన్నీ అక్కడే.. ఎందుకంటే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×