E-Paper
Advertisement

TFCC Elections : ప్రయత్నాలన్నీ ఫెయిల్.. ఛాంబర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది

TFCC Elections : ప్రయత్నాలన్నీ ఫెయిల్.. ఛాంబర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది
Advertisement

TFCC Elections : తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు నిర్వహించాలని కొంత మంది… ఎన్నికలేం వద్దు.. ఇప్పుడున్న కార్యవర్గాన్నే కొనసాగించాలి అని మరి కొంతమంది.. ఇలా ఛాంబర్ రెండు గ్రూపులుగా మారి గత కొన్ని నెలల నుంచి వివాదం సాగుతూనే వచ్చింది. వాటి అన్నింటికీ పులిస్టాప్ పెడుతూ… ఛాంబర్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) ఏర్పడి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు TFCC బైలాస్ ప్రకారం.. ప్రతి రెండేళ్లకు ఒక సారి కొత్త కార్యవర్గాన్ని, కొత్త అధ్యక్షుడిని ఓట్ల ద్వారా ఎన్నుకోవాలి. ప్రత్యేక్ష రాష్ట్రం ఏర్పాటు టైంలో, కరోనా లాంటి ప్రత్యేక్ష సందర్భాల్లో మాత్రమే ఈ ఎన్నికలు జరగలేదు.

Advertisement

కానీ, ఇప్పటి వరకు అధ్యక్షుడి హోదాలో ఉన్న భరత్ భూషణ్.. తన పదవీ కాలాన్ని పొడగించాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. నిజానికి భరత్ భూషణ్ కార్యవర్గం జూలై 31నే ముగిసింది. కానీ, ఆయన ఆందోళనలు చేస్తూ… ఇప్పటి వరకు వచ్చారు. భరత్ భూషణ్ ఎన్నికలు వద్దు అనడానికి పర్సనల్ రీజన్స్ చాలా ఉన్నాయంటూ, చిత్రపూరి ఆస్తులకు లింకులు ఉన్నాయంటూ ఎన్నో విమర్శలు వినిపించాయి.

డిసెంబర్‌లో ఎన్నికలు..

ఇవి అన్నీ పక్కన పెడితే.. ఫైనల్‌గా ఫిల్మ్ ఛాంబర్‌కు కొత్త కార్యవర్గం రాబోతుంది. ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం… డిసెంబర్ 28వ తేదీన (ఆదివారం) ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

నామినేషన్స్ డిటైల్స్ ఇవే..

Advertisement

ఈ ఎన్నికలకు నామినేషన్స్ పత్రాలను డిసెంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, తిరుపతి, విశాకపట్నం లో ఉన్న ఛాంబర్ ఆఫీస్‌ల్లో పొందవచ్చని తెలిపారు.

నామినేషన్స్‌కు చివరి తేదీ డిసెంబర్ 12న మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్‌లో ఇవ్వాలి.

వచ్చిన నామినేషన్స్‌ను డిసెంబర్ 13వ తేదీన స్క్రూటినీ చేస్తారు. అదే రోజున నామినేషన్స్ ధృవీకరించిన అభ్యర్థలు వివరాలను తెలియచేస్తారు.

నామినేషన్స్ ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ 19వ తేదీ చివరి తేదీ. ఇక చివరగా.. బరిలో ఉండే అభ్యర్థుల వివరాలను డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత ప్రకటిస్తారు.

ఎలక్షన్స్ & ఫలితాలు.. 

ఇక డిసెంబర్ 28న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్ జరుగునుంది.

కౌంటింగ్ అదే రోజు అనగా.. డిసెంబర్ 28న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉండబోతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

ఈ రోజు ఎన్నికైన నూతన కార్యవర్గం 2025 నుంచి 2027 వరకు ఉండనుంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×