Team India Players On Vaibhav Sooryavanshi: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐదు టి20 లో సిరీస్ కోసం న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా ప్లేయర్లు… 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని వెలివేసినట్టు ప్రచారం సాగుతోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సీనియర్ క్రికెటర్లు… వైభవ్ ను పట్టించుకోకుండా బయట చిల్ అవుతున్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. 15 ఏళ్ల బుడ్డోడు బయట తిరగొద్దని కండిషన్స్ పెట్టి అతన్ని ఒంటరి చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22 అంటే గురువారం రోజున టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ శ్రేయర్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి వాళ్ళు సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీని మాత్రం తీసుకువెళ్లలేదు. వైభవ్ సూర్యవంశీని కావాలనే టీమిండియా ప్లేయర్లు పక్కకు పెట్టి చిల్ అవుతున్నట్టు చెబుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని పట్టించుకోకుండా ఒంటరి చేస్తున్నట్టు ప్రచారం జోరు అందుకుంది. అయితే దీనిపై మాజీ క్రికెటర్లు, వైభవ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వైభవ్ ను ఒంటరి చేస్తారా ? అంటూ ఆగ్రహిస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య టి20 సిరీస్ ( India tour of New Zealand 2026) అక్టోబర్ 22వ తేదీ నుంచి షురూ కానుంది. మొదటి మ్యాచ్ హగ్లే ఓవల్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. 12 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారాలు కానున్నాయి. అలాగే ఉచితంగా డిడి స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వార్నింగ్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలం కావడం గ్యారెంటీ అన్నారు.