Madhuri Rathod:తనవైన ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టెప్స్ తో ఆడియన్స్ ని అలరించిన ఫోక్ బ్యూటీ మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయితో రెడ్ హ్యాండెడ్ గా రెడ్డి భవన్ లో దొరకడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెల్సిందే.ఇక ఆ తర్వాత ఇరువైపులా డైలీ సీరియల్ లా సాగిన వ్యవహారం ప్రస్తుతం సద్దుమనిగి నట్టే కనిపిస్తుంది.ఇక ఇప్పటికే మోహబ్బత్ అనే సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నానని, గతంలో జరిగిన విషయాలని మర్చిపోయి సరికొత్తగా జీవితాన్ని మొదలెడదామని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు కూడా.
ఇదిలా ఉంటే ఇటు మాధురి రాథోడ్ కూడా ఇపుడు ఆ బ్యాడ్ ఫేజ్ మర్చిపోయేందుకు వరుస ఫోక్ సాంగ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. అలా ఇప్పటికే కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 5.4మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం చూస్తుంటే మాధురికి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక పది రోజుల కిందటే రిలీజ్ అయిన గాజులోల్ల పోరడ అనే పాట ఏకంగా 1.8 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకుపోవడం ఇక్కడ మరో విశేషం.
ఇక అలా మాధురి రాథోడ్ ఈ మధ్య చేసిన రెండు పాటలు సోషల్ మీడియాలో సునామి స్ప్రుష్టిస్తుంటే తాజాగా వచ్చిన ”భామ సుందరాలో” అనే ఫోక్ సాంగ్ అంతకు మించి అంటూ కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 4.1మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో ఇపుడు ఎక్కడ చూసినా మాధురి రాథోడ్ గురించే చర్చ జరుగుతుంది.ముఖ్యంగా ఇందులో వచ్చే సూటి పోటి మాటలతో ఎన్నెల అనే లిరిక్స్ వింటుంటే ఇది కొంపదీసి మాధురి రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించా అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు ఫోక్ లవర్స్ .
ఇక శ్రీను.ఏవీ నిర్మాణంలో ఈ పాటకి సంగీతాన్ని వెంకట్ అజ్మీరా అందించగా, శేఖర్ వైరస్ దర్శకత్వంతో పాటు కొరియోగ్రఫీ అందించడం విశేషం .ఇక నర్సింలు, ముకుందలు పాట పాడగా హరీష్ పటేల్ సినిమాటోగ్రాఫర్‌గా (DOP) పనిచేశారు. ఇక ఈ టీమ్ లో శ్రీను.ఏవీ, వీకే వినోద్, కొర్రకిట్టు నాయక్, మారుతి కోడిమోజు, శశి, ఎస్. రాగ్వి, స్నికిత, సారిక, నాగప్రత్యూష, తేజు రావు పాల్గొన్నారు.
ఇక ఇదిలా ఉంటే పాట గ్లిమ్ప్స్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్. మాధురి రాథోడ్ ఏ సాంగ్ తీసిన ప్లాప్ అయినట్టు చరిత్రలోనే లేదు అని ఒకరంటే మాధురి రాథోడ్ దెబ్బ కి జాను అబ్బా అనాల్సిందే అంటూ మరొకరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు .ఇక డియర్ మధురి రాథోడ్ గారు, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సమాజం మిమ్మల్ని దోషిగా చిత్రీకరిస్తూ ఎన్ని నెగెటివ్ కామెంట్స్ చేసినా, వాటిని పట్టించుకోకుండా మీ పని మీద దృష్టి పెట్టి ధైర్యంగా ముందుకు సాగుతున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఎన్ని విమర్శలు ఎదురైనా లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్లాలని మీ ప్రయాణం చూసి నేర్చుకోవాలి అంటూ మరొకరు మాధురి రాథోడ్ కి సపోర్ట్ గా నిలవడం విశేషం. చూడాలి మరి ముందు ముందు ఈ భామ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
Also read:ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!