E-Paper
Advertisement

ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. రేస్‌లోకి రెబల్ స్టార్!

ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. రేస్‌లోకి రెబల్ స్టార్!
Advertisement

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) తన స్నేహితుల కోసం ఏమైనా చేస్తాడనేది మరోసారి నిరూపించారు. ఇటీవల యూవీ క్రియేషన్స్ (UV Creations) కోసం, ఆ బ్యానర్‌లో వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రయూనిట్‌తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు తన స్నేహితుడు శర్వానంద్‌ (Sharwanand) నటించిన, సోదరులు నిర్మించిన ‘బైకర్’ (Biker Movie) కోసం ఏకంగా రేసర్‌గా మారారు. అవును, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ కూడా భాగమయ్యారు. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’, ‘ఫౌజి’ అనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన తన లుక్ రివీల్ కాకుండా ఉండాలని, ఆ సినిమాల దర్శకులు ఎంతగా ప్రయత్నించినా, నిర్మాత మాత్రం తన స్నేహితుల కోసం పబ్లిక్‌లోకి వస్తూనే ఉన్నారు. మొన్న సంతోష్ శోభన్ కోసం, ఇప్పుడు శర్వా కోసం.. సపోర్ట్ ఇచ్చేందుకు ఇలా పబ్లిక్‌లోకి వచ్చి, తన అనుకుంటే ఎంత దూరమైనా ప్రభాస్ వెళతాడని చాటి చెప్పారు. ఇక విషయంలోకి వస్తే..

Also Read- ఎంతో ఇష్టంగా ఆ బైక్ కొనుక్కుంటే.. జీవిత అమ్మేసింది- రాజశేఖర్

శర్వా మా ఇంటి హీరో.. లెట్స్ రేస్

Advertisement

తాజాగా యూవీ క్రియేషన్స్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ‘‘శర్వా మా ఇంటి హీరో.. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్.. అంటూ, హెల్మెట్ ధరించి స్టైలిష్‌గా నడిచి వచ్చి బైక్‌పై కూర్చున్నారు. ‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’.. లెట్స్ రేస్’’ అంటూ ‘బైకర్’ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చేశారు. ప్రభాస్ ఈ వీడియోతో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం కాయం. అందులో డౌటే లేదు. ‘బైకర్’ ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా.. ట్రైలర్ టెర్రిఫిక్‌గా ఉందంటూ ట్వీట్ చేశారు ప్రభాస్. ఇప్పుడు ఏకంగా ఓ స్పెషల్ వీడియోతో దర్శనమివ్వడంతో.. ‘ఇక బైకర్ సినిమా సంగతి మేం చూసుకుంటాం అన్నా’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘ఇది మా సినిమా అన్నా.. థియేటర్లలో దుమ్ము రేపుతాం’ అంటూ ఒకటే కామెంట్స్. సపోర్ట్ అంటే ఇది.

Also Read- అఖిల్ ‘లెనిన్’సినిమాకు తప్పని ‘పెద్ది’ తిప్పలు.. అక్కినేని హీరో మళ్ళీ తప్పుకోవాల్సిందేనా?

ఇలా చిన్న వీడియో చేస్తే చాలు

Advertisement

ఒక పబ్లిక్ ఫంక్షన్‌కు వచ్చి, అక్కడ భజన చేయాల్సిన, చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ వంటి హీరో, ఇలా చిన్న వీడియో చేస్తే చాలు. ఏదిఏమైనా ఒక ఫ్రెండ్ కోసం, ఫ్యామిలీ కోసం.. ఇంతగా ప్రభాస్ నిలబడటం అనేది మాత్రం మాములు విషయం కాదు. అందుకే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ‘బైకర్’ సినిమాను నిర్మిస్తోంది. హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3న డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కాబోతోంది.

Also Read- నాగ్ 100 వ సినిమా.. ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయనున్న మన్మథుడు!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×