E-Paper
Advertisement

ఎంతో ఇష్టంగా ఆ బైక్ కొనుక్కుంటే.. జీవిత అమ్మేసింది- రాజశేఖర్

ఎంతో ఇష్టంగా ఆ బైక్ కొనుక్కుంటే.. జీవిత అమ్మేసింది- రాజశేఖర్
Advertisement

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘బైకర్’ (Biker). చార్మింగ్ స్టార్ శర్వానంద్, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామాలో ఆయన ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వన్నీ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా యాక్టర్ రాజశేఖర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

Also Read- అఖిల్ ‘లెనిన్’సినిమాకు తప్పని ‘పెద్ది’ తిప్పలు.. అక్కినేని హీరో మళ్ళీ తప్పుకోవాల్సిందేనా?

క్యారెక్టర్ బాగుంటే సరిపోదు

Advertisement

‘‘చాలా రోజుల తర్వాత నేను నటించిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన చిత్రమిది. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా? అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అందరికీ టెన్షన్ ఉంటుంది.. కానీ, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అనేది తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముందుగా నేను ఏ పాత్ర చేసినా అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను ‘బైకర్’ కథ విన్నప్పుడు నా పాత్రతో పాటు కథ కూడా నచ్చే ఈ సినిమా చేశాను. ఈ సినిమా కథ పరంగా సూపర్‌గా హిట్ అవుతుంది. అందులో డౌటే లేదు. అలాగే నా పాత్ర కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

Also Read- Bunny Vas: మలయాళ నిర్మాతలను హెచ్చరిస్తూ.. తెలుగు సినిమాపై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్!

నాకు తెలియకుండా అమ్మేసింది

Advertisement

నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అమ్మమ్మగారింటికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్ వేసుకుని తిరిగేవాడిని. ఆ తర్వాత ఆటోమేటిగ్గా బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘శేషు’ సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి ఎంతో ఇష్టంగా కొనుక్కొని ఆ షూటింగ్‌కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్‌ని రోజూ ఎంతో ఇష్టంగా నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి.. ‘మీరు చాలా రిస్క్‌తో నడుపుతున్నారు’ అని, నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేసింది. ‘బైకర్’లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్ (Bullet Sunil). ఈ పాత్ర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేను.. అంతా థియేటర్‌లోనే చూడాలి’’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

Also Read- విజయ్ మాజీ భార్యకు నెలకు 49 లక్షలు… ఇది భరణం కాదు బ్రో.. జస్ట్ గిఫ్ట్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×