E-Paper
Advertisement

Regina Cassandra: అప్పుడే తల్లైన రెజీనా.. వీడియో వైరల్!

Regina Cassandra: అప్పుడే తల్లైన రెజీనా.. వీడియో వైరల్!

Regina Cassandra: ఏంటీ రెజీనా కసాండ్రా (Regina Cassandra) అప్పుడే తల్లైపోయిందా.. ? పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యింది? అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అయితే తాజాగా రెజీనా కసాండ్రా ఒక పాపని ఎత్తుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రెజీనాతో ఒక పాప ఉండడం చూసి చాలామంది నెటిజన్లు ఇదేంటి రెజీనా ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది.. ఎప్పుడు పాప పుట్టింది అని షాక్ అయిపోతున్నారు.మరి నిజంగానే రెజీనా చేతిలో ఉన్న పాప ఆమె పాప నేనా.. అనేది చూస్తే..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో రెజీనా ఒక పాపను ఎత్తుకుంది. అయితే ఆ పాప ఆమె పాప అయితే కాదు. ఎందుకంటే రెజీనా ఒక కమర్షియల్ జ్యువెల్లరీ యాడ్ కోసం అలా ఓ పాపని ఎత్తుకొని ఒక యాడ్ కోసం నటించింది.

తల్లైన రెజీనా..

జ్యువెల్లరీ యాడ్ కి సంబంధించిన ఈ వీడియోలో రెజీనా కసాండ్రా తన చేతిలో ఒక పాపని ఎత్తుకోవడంతో పాటు తను వేసుకున్న జ్యువెల్లరీ మొత్తం హైలెట్ చేసింది.ముఖ్యంగా ఆ పాప చేతి వేళ్లకు,చేతులకు కూడా ఉన్న ఆభరణాలు హైలైట్ అయ్యేలా ఈ యాడ్ ప్రమోషన్ ఉంది. అలా కమర్షియల్ జువెల్లరీ యాడ్ కోసం రెజీనా చేసిన ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజెన్లు ఇదేంటి రెజీనా ఎప్పుడు తల్లి అయింది.. ఆమె చేతిలో ఉన్న పాప ఎవరు అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమె ఓ కమర్షియల్ జువెల్లరీ యాడ్ కోసం అలా నటించింది అని తెలియడంతో యాడ్ కోసం అలా చేసిందా..మేం ఇంకా రెజీనాకి నిజంగానే పాప పుట్టిందని అనుకుంటున్నాం అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

రెజీనా కసాండ్రా సినీ కెరియర్..

రెజీనా కసాండ్రా సినీ కెరియర్ గురించి చూసుకుంటే.. సుధీర్ బాబు నటించిన శివ మనసులో శృతి(SMS) అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా గుర్తింపు తెచ్చి పెట్టకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రొటీన్ లవ్ స్టోరీ,కొత్తజంట రెండు సినిమాలు రెజినాకి ఇండస్ట్రీలో ఎంతో కొంత పాపులారిటీ అయితే తెచ్చిపెట్టాయి.

టాలీవుడ్ లో రెజీనాకి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది పిల్లా నువ్వు లేని జీవితం మాత్రమే.. సాయి దుర్గ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కి మొదటి సినిమా. కానీ మొదటి సినిమాతోనే సాయి దుర్గ తేజ్ తో పాటు రెజీనాకి కూడా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో రెజీనా క్రేజ్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం వ్యాపించింది.అలా వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.దాంతో స్టార్ హీరోల సినిమాల్లో రెజీనాకి హీరోయిన్ రోల్స్ చేసే అవకాశం వచ్చింది.

అలా రారా కృష్ణయ్య, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,సౌఖ్యం వంటి సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది. టాలీవుడ్లో రెజీనా చివరిగా ఉత్సవం అనే సినిమాలో కనిపించింది.ఆ తర్వాత పూర్తిగా తమిళ,హిందీ సినిమాలకే పరిమితమైపోయింది.

ALSO READ:Ramya Krishnan: నిన్న అజిత్.. నేడు రమ్యకృష్ణ.. భయపెడుతున్న బాంబు బెదిరింపులు!

రెజీనా కసాండ్రా సినిమాలు..

ఈ ఏడాది తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన విదాముయార్చి సినిమాలో రెజీనా కూడా కీ రోల్ పోషించింది. అలాగే హిందీలో జాట్ మూవీ తో హిట్ కొట్టింది. కేసరి చాప్టర్ 2 మూవీలో కూడా కీ రోల్ పోషించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది.

రెజీనా కసాండ్రా చేతిలో ప్రస్తుతం మూకుత్తి అమ్మన్ -2, ఫ్లాష్ బ్యాక్,బోర్డర్, పార్టీ,కల్లా పార్ట్ వంటి తమిళ సినిమాలతో పాటు సెక్షన్ 108 అనే హిందీ మూవీ, మారీచికా అనే మలయాళ మూవీ ఉంది. అలా ఈ హీరోయిన్ కెరియర్ దాదాపు ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో సడన్గా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ పాత్ర కాకపోయినా సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతుంది. అలాంటి రెజీనా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తుంది.

?igsh=ZjFkYzMzMDQzZg%3D%3D

 

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×