E-Paper
Advertisement

Chinese worker: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!

Chinese worker: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!
Advertisement

ఆరోగ్యం బాగా లేకపోతే సెలవు తీసుకుంటారు. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటారు. కానీ, హెల్త్ బాగాలేదని బయట తిరిగితే? కాలి నొప్పి ఉందని సెలవు తీసుకుని, ఆఫీస్ ముందు నుంచే పరిగెత్తితే, అలా వెళ్లడాన్ని ఆఫీస్ వాళ్లు చూస్తే, ఉద్యోగంలో నుంచి పీకేయడం పక్కా. చైనాలో ఓ ఉద్యోగి కూడా ఇదే గతి పట్టింది. కాలి నొప్పి అని సెలవు పెట్టి కిలో మీటర్ల కొద్ది రన్నింగ్ చేశాడు. ఆ విషయం తెలిసి కంపెనీ అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసింది. కానీ, అతడు తనను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలిగించారంటూ కంపెనీ మీద కోర్టులో కేసు వేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కోర్టు కూడా అతడికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఉద్యోగం నుంచి తొలగింపు

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ కు చెందిన చెన్ అనే యువకుడు, జియాంగ్సులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 2019 ఫిబ్రవరి, మార్చిలో.. అతడు తనకు వెన్నునొప్పి ఉందని చెప్పి సిక్ లీవ్ కోసం అప్లై చేసుకున్నాడు. హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా అతడికి కంపెనీ లీవ్ ఇచ్చింది.  ఒక నెల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత, చెన్ తిరిగి జాబ్ లో జాయిన్ అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ సెలవు కోసం అప్లై చేసుకున్నాడు. ఈసారి అతని కుడి పాదంలో నొప్పి ఉందని చెప్పాడు. డాక్టర్ ఒకవారం రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు మెడికల్ సర్టిఫికేట్ చూపించాడు. ఆ తర్వాత కూడా పలు ఆరోగ్య సమస్యలు అని చెప్పి లీవ్ పొడిగించుకున్నాడు. కానీ, కొద్ది రోజుల తర్వాత అతడు చెప్పేది నిజం కాదని కంపెనీ, ఉద్యోగంలో నుంచి తొలగించింది.

కంపెనీపై కోర్టుకు వెళ్లిన చెన్

Advertisement

అటు తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ చెన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాను డాక్టర్ సలహా మేరకే సెలవు తీసుకున్నట్లు కోర్టుకు వివరించాడు. తాను తీసుకున్న సెలవుకు డార్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కు సరిగా మ్యాచ్ అయ్యిందిని చెప్పాడు. వారు చెప్పినట్లే సెలవు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. చెన్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. కంపెనీ అతడికి 16,700 అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 15 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

తీర్పును సవాల్ చేసిన కంపెనీ

కంపెనీ కోర్టులో ఆర్బిట్రేషన్ తీర్పును సవాలు చేసింది. చెన్ పాదాల నొప్పి కారణంగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే కంపెనీ వైపు పరిగెత్తుతున్న దృశ్యాలు తమ కంపెనీ సీసీటీవీల్లో రికార్డు అయినట్లు వెల్లడించింది. అంతేకాదు, అతడు ఆ రోజు ఏకంగా 16 వేల అడుగులకు పైగా నడిచాడని వాదించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కంపెనీ సమర్పించిన ఆధారాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని చెన్ వాదించాడు. తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కచ్చితమైన మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు అందించినట్లు చెప్పాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చెన్ ను కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించినట్లు వెల్లడించింది. అతడికి పరిహారం అందించాల్సిందేనని తుది తీర్పు వెల్లడించింది.

Advertisement

Read Also: బర్రెల మీద పోలీసుల పెట్రోలింగ్, ఆ బాధ తప్పాలంటే ఇవే బెస్ట్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×