E-Paper
Advertisement

Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసు.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ తొలి ప్రకటన, గుర్తింపు వేటు ఖాయమా?

Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసు.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ తొలి ప్రకటన, గుర్తింపు వేటు ఖాయమా?
Advertisement

Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని పేలుడు కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? నిందితులను ఆశ్రయం కల్పించిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ యూనివర్సిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టిందా?  నేడో రేపో గుర్తింపు రద్దు ఖాయమా? తమకు- నిందితులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోందా? అవుననే అంటున్నారు దర్యాప్తు అధికారులు.

ఢిల్లీ పేలుడు ఘటనపై రియాక్ట్

Advertisement

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ పేరు ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటన, ఫరీదాబాద్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌‌కు సంబంధించి అక్కడ పని చేస్తున్న వైద్యులు కీలకంగా మారారు. రేపో మాపో ఆ యూనివర్సిటీపై వేటు తప్పదని వార్తలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటన జరిగి రెండు రోజుల తర్వాత అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ యాజమాన్యం రియాక్ట్ అయ్యింది.

జరిగిన దురదృష్టకర పరిణామాలు బాధించాయని తెలిపింది. తమ సంస్థ గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్‌ పేరిట స్టేట్‌మెంట్ విడుదలైంది. పేలుడు ఘటన తర్వాత పట్టుబడిన వైద్యులకు తమతో కేవలం వృత్తిపరమైన సంబంధం ఉందని పేర్కొంది. దర్యాప్తులో ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని వెల్లడించింది.

Advertisement

అల్-ఫలాహ్ యూనివర్సిటీ తొలి ప్రకటన

వారితో వృత్తిపరంగా తప్ప, ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తాము ఎలాంటి రసాయనాలను నిల్వ చేయలేదని, అలాగే ఉపయోగించలేదని స్పష్టం చేసింది. తాము అందిస్తున్న కోర్సులకు అనుగుణంగా ల్యాబ్‌లను వినియోగిస్తున్నట్లు అందులోని సారాంశం.

జైషే మహ్మద్-అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న పలువుర్ని దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ కేసులో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు వైద్యులు ఉన్నారు.

ALSO READ:  ఢిల్లీ పేలుడు ఘటన..  వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

అంతేకాదు ఢిల్లీ పేలుడు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ ఈ వర్సిటీలో పని చేశాడు. రెండు రోజులుగా ఆ క్యాంపస్‌లో తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది, పలువుర్ని ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యాజమాన్యం ఈ ప్రకటన చేసింది.

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ విలేజ్‌లో దాదాపు 70 ఎకరాల్లో ఆ యూనివర్సిటీ విస్తరించింది. ఆ రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీ కింద ఏర్పాటు చేశారు. తొలుత ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైన వర్సిటీ, 2013లో యూజీసీ నుంచి ఏ గ్రేడ్ అందుకుంది. సరిగ్గా పదేళ్ల కిందట హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ హోదాను ఇచ్చింది.

దానికి అనుబంధంగా ఆరేళ్ల కిందట అల్‌ ఫలాహ్‌ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. 650 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఈ క్యాంపస్‌లో ఐదు బ్యాచ్ లుగా ఎంబీబీఎస్ కోర్సు అందిస్తోంది. అరెస్టయిన ముజమ్మిల్ ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ డాక్టర్ గా పని చేస్తున్నాడు. డాక్టర్ సాహీన్ కూడా ఈ వర్సిటీలో రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవాడు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×