E-Paper
Advertisement

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!
Advertisement

Moon Walk Movie : కోలీవుడ్ డ్యాన్సర్, హీరో ప్రభుదేవా ఈ మధ్య హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఈయన ఖాతాలో హిట్ సినిమాలు పడలేదు.. ప్రస్తుతం మూన్ వాక్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నాడు.. డిఫరెంట్ స్టోరీతో వస్తున్న ఈ మూవీ పాజిటివ్ వైబ్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. మరి ఆ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి రాబోతుంది. మరి ఎప్పుడు రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

‘ మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్..

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈమధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. సినిమాల రిజల్ట్ఎలా ఉన్నా సరే ప్రభుదేవా మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలో ఈయన నుంచి వచ్చిన సినిమాలు యావరేజ్ కాకుండా అందుకున్నాయి.. ఇప్పుడు మరో పవర్ ఫుల్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ పేరు మూన్ వాక్.. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడమే కాకుండా, తొలిసారి వెండితెరపై నటుడిగానూ మెరవనున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.. ఇద్దరు లెజెండరీలు ఒకే సినిమాలు కనిపించడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ మూవీ విషయానికొస్తే..

Advertisement

ఇకపోతే దర్శకుడు మనోజ్ ఎన్.ఎస్. దర్శకత్వంలో బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వినోదం, సంగీతం, నృత్యం ప్రధానాంశాలుగా సాగే ఈ సినిమాను ఒక సంపూర్ణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇందులో ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు ఏకంగా 16 విభిన్న పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇక ఇందులో అజు వర్గీస్, అర్జున్ అశోకన్, నిష్మా, సుస్మిత, రెడ్డిన్ కింగ్స్‌లీ, మొట్టై రాజేంద్రన్ వంటి భారీ తారాగణం ఈ మూవీలో నటిస్తున్నారు.. ఇప్పటివరకు వచ్చిన ఈ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. దాంతో సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. నిజానికి దీపావళి బరిలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. మరి ఈ రేసులో స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి. మరి ఆ సినిమాలతో ఎలాంటి పోటీని ఎదుర్కొంటాయో చూడాలి..

Also Read : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

Big Stories

Advertisement
×