E-Paper
Advertisement

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. రానున్న కొద్ది గంటల వ్యవధిలో ఆయాజిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం?

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సూచనలు ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని అమరావతిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.

ఏపీకి వర్ష సూచన, ఆరెంజ్ అలర్ట్ జారీ

Advertisement

కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులతో వస్తాయని అంచనా వేసింది. ఆ సమయంలో ప్రజలు భారీ చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. రానున్న మూడు రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 8 వరకు ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.

ALSO READ: మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- రోజా ప్రశ్న

Advertisement

అటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అక్కడి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం తెలంగాణల్లో వాతావరణ పొడిగా ఉంది. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బుర్ఘంపాడు తేలికపాటి వర్షాలు పడ్డాయి. సెప్టెంబర్ 12 వరకు తెలంగాణ, కర్ణాటక, ఏపీ, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షా పడతాయని వెల్లడించింది.

Related News

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×