Amaravati: ఏపీలో డీఎస్సీ-2025 వ్యవహారంలో ఏం జరుగుతోంది? రోజుకో వ్యవహారాన్ని వైసీపీ ఎందుకు తెరపైకి తెస్తోంది? నిజంగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయా? బాధితుల తరపున వాయిస్ వినిపిస్తున్న బిగ్ టీవీ ఛానెల్ సోషల్ మీడియా ఎందుకు బ్లాక్ చేసిందా? దీనిపై వైసీపీ నేత, మాజీమంత్రి రోజా ఏమన్నారు?
గతేడాది ఏపీ మెగా డీఎస్సీ-2025పై ఎడతెగని పోరాటం చేస్తోంది వైసీపీ. కచ్చితంగా అవకతవకలు చోటు చేసుకున్నాయని బలంగా వాదిస్తోంది. న్యాయస్థానాలకు వెళ్లినా ఫలితం లేక పోయింది. డీఎస్సీపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది. ఆదిలో వెల్లువెత్తిన అనుమానాలపై ఏపీ ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశం పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. అయినా ఎక్కడో దగ్గర అవకతవకల జాడలు బయటపడుతూనే ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో ఓ అభ్యర్థికి టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా కేవలం 65 మార్కులు వచ్చాయి. స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. ఒన్-టు-ఒన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారని, అర్హత లేదని తెలిసి సదరు వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారని వైసీపీ ప్రశ్నించింది. దరఖాస్తు దశలో రిజెక్ట్ కావాల్సిన సదరు అభ్యర్థి ఉద్యోగం ఎలా పొందగలిగాడన్నది జగన్ ప్రశ్న. అధికారుల చేత ఈ పని చేయించిన వెనుక వ్యక్తి ఎవరంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు వైసీపీ అధినేత జగన్. డీఎస్సీ–2025లో ఆ తరహా అక్రమాలు చాలానే జరిగాయిని ఆరోపించారు.
బాధితుల వెర్షన్ నుంచి కథనాలను ప్రసారం చేసింది బిగ్ టీవీ. అందుకుగాను ఆ ఛానెల్ సోషల్ మీడియాలో ఆంక్షలు విధించింది. ఈ విషయం తెలియగానే వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. డీఎస్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడు తుండడంతో బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలపై ఆంక్షలేంటని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటిపై కథనాలు ప్రసారం చేసినందుకు సాక్షి, బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లను భారత్‌లో కనిపించకుండా చేయించడం మీ భయానికి నిదర్శనం కాదా? నిజాన్ని ఎదుర్కోలేని మీ పిరికితనానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.
ALSO READ: ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!
మరోవైపు డీఎస్పీ కథనాలపై మీడియా కథనాలపై పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపింది. కర్నూలు డీఈఓ విచారణను ప్రారంభించారని, సమగ్ర పరిశీలన కోసం రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించినట్టు పేర్కొంది. విచారణ నివేదిక అందగానే రిక్రూట్మెంట్ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెగా DSC-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది.
రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలపై ఆంక్షలేంటి @ncbn గారూ? సాక్షి డిజిటల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లను భారత్‌లో కనిపించకుండా చేయించడం మీ భయానికి నిదర్శనం… pic.twitter.com/stF2vlKiGD
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 4, 2026