E-Paper
Advertisement

Ramayan Film: రామాయణ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు లీక్.. చిత్ర బృందం రియాక్షన్ ఇదే!

Ramayan Film: రామాయణ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు లీక్.. చిత్ర బృందం రియాక్షన్ ఇదే!
Advertisement

Ramayan Film: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో రామాయణ (Ramayan)సినిమా ఒకటి ప్రముఖ దర్శకుడు నితేష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా రామాయణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి(Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇందులో రణబీర్ రాముడి పాత్రలో సాయి పల్లవి సీతమ్మ పాత్రలో కనిపించబోతున్నారు.

సాయి పల్లవి లుక్స్ పై ట్రోల్స్..

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని 2026 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులు కూడా పూర్తి అవుతున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా సెట్ నుంచి రణబీర్ కపూర్ సాయి పల్లవికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో భాగంగా వీరిద్దరూ సీతారాముడు గెటప్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సాయి పల్లవి లుక్స్ పట్ల కూడా విమర్శలు వచ్చాయి.

AI తో రూపొందించిన ఫోటోలు..

Advertisement

సీత పాత్రలో సాయి పల్లవి ఏమాత్రం సెట్ అవ్వలేదు అంటూ ఆమె లుక్స్ గురించి కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ఈ ఫోటో పై స్పందించారు. ఈ సందర్భంగా సాయి పల్లవి రణబీర్ కపూర్ ఫోటోలపై స్పందించిన చిత్ర బృందం ఈ ఫోటోలు రామాయణ సినిమాకు సంబంధించిన ఏమాత్రం కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటోలు AI టెక్నాలజీ ద్వారా రూపొందించినవి. 2015లో ప్రసారమైన ‘సియా కే రామ్’ అనే సీరియల్ నుంచి సీతారాముడి స్టిల్స్ తీసుకొని వాటిని ఎడిట్ చేస్తూ వారి ముఖాలకు బదులుగా రణబీర్ సాయి పల్లవి ముఖాలను పెట్టి ఎడిట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో రామాయణ సినిమాకు సంబంధించింది కాదంటూ చిత్ర బృందం స్పష్టం చేశారు.

రావణాసురుడిగా యశ్…

Advertisement

ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఈ ఫోటో ద్వారా సినిమాపై కాస్త నెగిటివ్ బజ్ కూడా ఏర్పడింది ముఖ్యంగా సాయి పల్లవి లుక్స్ గురించి నెగెటివిటీ రావడంతో చిత్రబృందం స్పందించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా రావణాసురుడి పాత్రలో ప్రముఖ నటుడు యష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. రామాయణ సినిమాకు నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరించగా నటుడు యశ్ సహనిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: Rajendra Prasad: నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఫైర్ అవుతున్న తమిళ తంబీలు..ఇక మారరా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×