Renu Desai:పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మాత్రమే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిన్నారు రేణు దేశాయ్ నటిగా, స్టైలిస్ట్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి అనుభవం సంపాదించిన రేణు దేశాయ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని .. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం తాను చేసిన పనులు, అప్పట్లో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలని ఇలా చెప్పుకొచ్చారు.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచి హీరోయిన్గా నటించడం కంటే సినిమా మేకింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేదని చెప్పారు. ముఖ్యంగా ‘జానీ’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సినిమా కోసం అవసరమైన టెక్నికల్ టీమ్‌ను ఎంపిక చేయడం, ఇతర పనుల్లోనూ తాను పార్టిసిపేట్ చేశానని తెలుగు సిని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన తొలి వ్యక్తిని తానేనని కూడా ఆమె ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
అలాగే ‘బద్రి’ సినిమా తర్వాత తనకు నటన కంటే సినిమా వెనుక జరిగే పనులపైనే ఎక్కువ ఆసక్తి ఉండేదని అయితే ‘జానీ’ సినిమాలో గీతాంజలి పాత్ర కోసం సరైన అమ్మాయి దొరకకపోవడంతో చివరికి తననే నటించమని అడిగారని తెలిపారు.ఇక సినిమా మొదలవడానికి వారం రోజుల ముందు ఈ విషయం చెప్పడంతో మొదట్లో తాను ఒప్పుకోలేదని, ఎందుకంటే అప్పటికే ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు కూడా తనపై ఉన్నాయని చెప్పారు. అయినా చివరకు అందరూ చేయమని అనడంతో ఆ పాత్రలో నటించాల్సి వచ్చిందని వాపోయారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కోసం విదేశాలకు వెళ్లి స్పెషల్ కాస్టూమ్స్ తీసుకొచ్చిన విషయాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లండన్, మిలాన్ వంటి ప్లేసెస్ కి వెళ్లి పవన్ కోసం స్పెషల్ గా కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసేవారమని తెలిపారు. ముఖ్యంగా ‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్స్ కోసం ప్రత్యేకంగా మిలాన్ వెళ్లి, ముందుగా అడ్వాన్స్ ఇచ్చి మరీ తీసుకున్నామని బాలు నాటి రోజులని గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో ఒక ప్యాంట్ ధర సుమారు రూ.75 వేల వరకు ఉండేదని, సినిమా కంటిన్యూటీ కోసం మరిన్ని ప్యాంట్స్ అవసరమని నిర్మాతను ఒప్పించి మరీ తెప్పించమని తెలిపారు.అలా చాల ఎఫర్ట్ పెట్టాము కాబట్టే సినిమా వచ్చి చాలా ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ ప్యాంట్ గురించి మాట్లాడుకుంటున్నామని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
అయితే తనను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పిలవడం మాత్రం తనకి ఇష్టం లేదని వాపోయారు. తాను స్టైలిస్ట్నని,కలర్స్ నుండి కాస్ట్యూమ్ వాటికి సరిపోయే జ్యువెలరీ సెలెక్ట్ చేయడం పై కొంచెం అవగాహన ఉందని కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది పూర్తిగా వేరే అని తనకు రాని పనిని వచ్చినట్టు చెప్పుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.
ఇక తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. బయటకు వేగంగా మాట్లాడే వ్యక్తిలా కనిపించినా, తనలో మరో ప్రశాంతమైన కోణం కూడా ఉందని రేణు తెలిపారు. ఫామ్‌లో గడపడం, ఆకాశం వైపు చూస్తూ ప్రశాంతంగా ఉండటం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మొత్తానికి ఈ పాడ్‌కాస్ట్‌లో రేణు దేశాయ్ బాలు సినిమా ప్యాంట్ గురించి చెప్పిన మాటలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
ALSO READ :పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!