E-Paper
Advertisement

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!
Advertisement

CURE Act: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్యూర్ కొత్త చట్టంతో క్యూర్ సిటీ మొత్తంలో సర్కారు పెత్తనం పెరగనుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నకోబడిన పాలక మండలిలు, వాటికి పెద్దలుగా వ్యవహారించే నగర ప్రథమ పౌరుడు మేయర్, డిప్యూటీ మేయర్లు సైతం క్యూర్ చట్టంలో కొత్తగా పొందుపర్చిన నిబంధనలను ఉల్లంఘిస్తే పదవీ కొల్పోయేలా కొత్త నిబంధనలున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం నుంచి అమల్లో ఉన్న మున్సిపల్ యాక్టు 1959 స్థానంలో కొత్త క్యూర్ చట్టాన్ని సర్కారు తీసుకువచ్చిన సంగతి తెల్సిందే.

ఈ కొత్త చట్టం ద్వారా..

ఈ క్యూర్ చట్టంలో 309 నుంచి 314 సెక్షన్లు నగర పాలనలో ప్రభుత్వానికి అత్యంత విస్తృతమైన అధికారాలను కల్పిస్తున్నాయి. అవసరమైతే మేయర్ లేదా డిప్యూటీ మేయర్‌ను తొలగించడం, మొత్తం కార్పొరేషన్‌ పాలకవర్గాన్ని రద్దు చేయడం, నేరుగా ప్రత్యేకాధికారిని సర్కారు నియమించి పాలన పగ్గాలను అప్పగించే అవకాశముంది. వివిధ సంస్థల అధికారాలను ఒకదాని నుంచి మరొకదానికి బదిలీ చేయడం వంటి కీలక అధికారాలు ప్రభుత్వానికి ఈ కొత్త చట్టం ద్వారా సమకూరేలా నిబంధనలున్నాయి.

పనితీరును బట్టి..

Advertisement

ప్రభుత్వం ఏ శాఖకు చెందిన అధికారిని స్పెషలాఫీసర్ గా నియమించవచ్చునన్న నిబంధనపై చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగినపుడు వేల సంఖ్యలో అభ్యంతరాలొచ్చాయి. కేవలం మున్సిపల్ శాఖకు చెందిన అధికారులనే స్పెషలాఫీసర్లుగా నియమించాలని కూడా సూచనలు, సలహాలు వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం. పరిపాలన సౌలభ్యం, పౌర సేవల నిర్వహణను మెరుగుపరిచేందుకు సర్కిళ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణను కార్పొరేషన్ చేసుకునేలా సెక్షన్ 312, మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరును బట్టి కార్పొరేషన్ అధికారాలను టీజీఐఐసీకి సర్కారు బదిలీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ సెక్షన్ 313 ను పొందుపర్చారు.

మేయర్‌పై చర్యలు తీసుకునేలా సెక్షన్ 309..

ప్రజలచే, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన పాలక మండలి పెద్దలు మేయర్ లేదా డిప్యూటీ మేయర్ చట్ట నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, కార్పొరేషన్ల నిధులను కేటాయించిన అంశం కాకుండా ఇతర అంశాలకు వెచ్చించినా, పనులు చేపట్టకుండా నిధులను దుర్వినియోగం చేసినా ప్రభుత్వం వారిని తొలగించేలా క్యూర్ చట్టంలో కొత్తగా నిబంధనలు వచ్చాయి. తొలగింపునకు ముందు సంబంధిత ప్రజాప్రతినిధికి తన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఈ కొత్త చట్టం కల్పించింది. ప్రభుత్వం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్‌లో తొలగింపునకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఒకసారి తొలగించబడిన వ్యక్తి తదుపరి సాధారణ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేసే అర్హతను కోల్పోయేటంత కఠినంగా కొత్త నిబంధనలున్నాయి.

Advertisement

Also read: దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

పాలక మండలి రద్దు చేసేలా సెక్షన్ 310

పాలకవర్గం తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోయినా, వరుసగా నిర్లక్ష్యం చేసినా, అధికారాలను దుర్వినియోగం చేసినా, కార్పొరేషన్ ను ఆర్థిక స్థిరత్వం దెబ్బతినేలా నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపు వంటి చర్యలకు పాల్పడినట్లు నిర్థారణ అయితే, ఇక సదరు పాలక మండలి పాలన కొనసాగడం అసాధ్యమని ప్రభుత్వం భావిస్తే మొత్తంగా రద్దు చేసేలా క్యూర్ చట్టాంలో నిబంధనలున్నాయి. అయితే, దీనికంటే ముందు ప్రభుత్వం పాలక మండలి పెద్దలకు, సభ్యులకు కార్పొరేషన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసేలా కూడా నిబంధనలున్నాయి. కార్పొరేషన్ తన అభ్యంతరాలు తెలిపే అవకాశాన్ని కూడా కల్పించింది. మేయర్‌కు వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వాలని చట్టంలో వెసులుబాటు కల్పించారు.

కొత్త పాలకవర్గం..

పాలకవర్గం రద్దు అయిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్, ఎన్నికైన సభ్యులు, ఎక్స్-ఆఫిషియో సభ్యులు అందరూ తమ పదవులను కోల్పోతారని చట్టం స్పష్టమైన వివరణ ఇస్తుంది. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు ప్రభుత్వం నియమించే స్పెషలాఫీసర్ పాలనను కొనసాగించనున్నారు. అవసరమైతే కమిషనర్‌కు అదనపు అధికారాలను కూడా ప్రభుత్వం అప్పగించేలా నిబంధనలున్నాయి. ఆరు నెలల్లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించి, తిరిగి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చట్టంలో నిబంధనలున్నా, రద్దు చేసిన పాలక మండలి అధికార గడువు ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. సర్కారు నిర్ణయం మేరకు మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా క్యూర్ చట్టంలో నిబంధనలను పొందుపర్చారు.

సర్కారు ఆదేశాలు పాటించాల్సిందే..

ప్రజావసరాలను దృష్టి పెట్టుకుని, అభివృద్ది, ప్రజాసంక్షేమం, పౌర సేవల నిర్వహణ, విపత్కర సమయంలో సత్వర సహాయం వంటి తదితర అంశాల ప్రాతిపదికన సర్కారు మున్సిపల్ కార్పొరేషన్లకు జారీ చేసే ఆదేశాలను ఇదివరకు పక్కన బెట్టిన విధంగా కాకుండా క్యూర్ చట్టంలోని సెక్షన్ 311 ప్రకారం తప్పకుండా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం ఏ కార్పొరేషన్‌కైనా, శాఖకైనా, అథారిటీ లేదా ఇతర సంస్థలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసే పవర్ కొత్త చట్టం ద్వారా సర్కారుకు వచ్చింది. వాటిని నిర్దిష్ట గడువులో అమలు చేయడం తప్పనిసరి. ఆదేశాలు పాటించకపోతే కారణం చెప్పే అవకాశం ఇచ్చిన తర్వాత సంబంధిత పనిని ప్రభుత్వం నేరుగా తన ఆధీనంలోకి తీసుకుని పూర్తి చేసేలా కూడా వెసులుబాటు కల్పించారు.

Also read: దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×