E-Paper
Advertisement

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!
Advertisement

Ecuador Priest: ఈక్వెడార్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థనలు (మాస్) నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శిలువ పాస్టర్ పై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈక్వెడార్‌లోని గ్వాయాక్విల్ నగరంలో శనివారం (అక్టోబర్ 17) ఈ ఘటన జరిగింది. అక్కడి ‘న్యుస్ట్రా సెనోరా డెల్ పెర్పెటు సొకోర్రో’ (Nuestra Senora del Perpetuo Socorro) చర్చిలో ఫాదర్ పాట్రిసియో అల్ఫ్రెడో శాంచెజ్ మొలినారి (Father Patricio Alfredo Sanchez Molinari) భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థనలను లైవ్‌స్ట్రీమ్ చేస్తుండగా ఫాదర్ వెనుక గోడకు బిగించి ఉన్న పెద్ద శిలువ అకస్మాత్తుగా ఊడి కిందపడింది. శిలువ సరిగ్గా ఫాదర్ తల భాగంపై పడటంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు.

Advertisement

Also Read: విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

Advertisement

ఇదిలా ఉంటే ఫాదర్ శాంచెజ్ మొలినారి ఆ చర్చికి మాత్రమే కాకుండా ‘కాంగ్రిగేషన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ రెడీమర్’ (Congregation of the Most Holy Redeemer) సంస్థలో కూడా సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల స్థానిక క్రైస్తవులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

Tags

Related News

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×