E-Paper
Advertisement

AI Cinema: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఇక సినిమాలు తీయడం కష్టమే.. ఎందుకంటే?

AI Cinema: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఇక సినిమాలు తీయడం కష్టమే.. ఎందుకంటే?
Advertisement

AI Cinema: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో సినీ పరిశ్రమ భవిష్యత్తుపై బాంబు పేల్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలో వచ్చిన Seedance 2.0 అనే టూల్‌ను ఉద్దేశిస్తూ, ఇది ప్రస్తుత సినీ నిర్మాణ వ్యవస్థను “ఖూనీ” చేయబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పును ఆయన ‘సినిమా రంగ ప్రజాస్వామ్యీకరణ’ గా అభివర్ణిస్తూ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు వందల కోట్ల బడ్జెట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కానీ, గోరఖ్‌పూర్ లేదా కోయంబత్తూర్ వంటి చిన్న పట్టణాల్లో ఉండి, సరైన అవకాశాలు లేక మగ్గిపోతున్న ఎంతోమంది రాజమౌళీలు బయట ఉన్నారని వర్మ అన్నారు. గతంలో వారికి సినీ పరిశ్రమలోకి వచ్చే దారి లేదు. కానీ, ఇప్పుడు AI ఆ అవకాశాల తలుపును పగులగొట్టిందని ఆయన పేర్కొన్నారు.

Read also-Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!

ఒక్క ‘ప్రాంప్ట్’ తో కోట్లాది రూపాయల విజువల్స్

Advertisement

కేవలం ఒక వర్ణన (Prompt) ఇస్తే చాలు.. Seedance 2.0 వంటి టూల్స్ అత్యున్నత నాణ్యత కలిగిన సినిమాటిక్ సీన్స్‌ను, సౌండ్ డిజైన్‌తో సహా సృష్టించగలవు. వీటికి వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదు. 300 మంది యూనిట్ సభ్యులు, లైట్ బాయ్స్, మేకప్ మెన్ అవసరం ఉండదు. నెలల తరబడి షూటింగ్ చేయాల్సిన పనిలేదు. గత 100 ఏళ్లుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న “డైనోసార్ల” (పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ల వ్యవస్థ) మీదకు AI అనే గ్రహశకలం (Asteroid) దూసుకొచ్చిందని వర్మ పోల్చారు. “ఇకపై స్టార్ల సమస్యలు ఉండవు, బడ్జెట్ చూసి నిర్మాతలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి, ఒక్క ఆలోచన, ఒక్క ప్రాంప్ట్.. చాలు ఒక పూర్తి నిడివి సినిమాను థియేటర్ క్వాలిటీతో నిర్మించడానికి.” అంటూ తెలిపారు.

Read also-Nindu Noorella Saavasam Serial Today February 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంటికి బయలుదేరిన మిస్సమ్మ  

నాకంటే మెరుగైన వారు

Advertisement

తను ‘శివ’ సినిమా చేస్తున్న సమయంలో నాగార్జున గారికి కేవలం 10 మంది దర్శకుల ఆప్షన్లు ఉండేవని, కానీ ఇప్పుడు ఆయన ముందు వెయ్యి మంది ఉంటారని వర్మ అన్నారు. అందులో 990 మంది తనకంటే గొప్ప ప్రతిభావంతులు అయ్యే అవకాశం ఉందని ఆయన నిజాయితీగా అంగీకరించారు. సినిమా ఇండస్ట్రీ చనిపోతోందా? అని కొందరు భయపడుతుంటే, వర్మ మాత్రం దీన్ని “సినిమా విముక్తి” అని పిలుస్తున్నారు. కేవలం డబ్బు, పలుకుబడి ఉన్నవారికే కాకుండా, కేవలం “టాలెంట్” ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రంగం చేరువవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్జీవీ మాటల్లో చెప్పాలంటే, పాత పద్ధతులకు ఇది “మరణశాసనం” కావచ్చు, కానీ సృజనాత్మకతకు మాత్రం ఇది కొత్త ఊపిరి. ఈ “హంతకుడే” రేపటి తరం సినిమాకు “రక్షకుడు” కాబోతున్నాడు. సినిమా ప్రపంచంలో ఇకపై గెలిచేది కేవలం ‘ప్రతిభ’ మాత్రమే! అంటూ ఆర్జీవీ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×