E-Paper
Advertisement

TG Health Department: ఆ మేడం ఎక్కడ పనిచేసిన రిజెల్ట్ సూపర్.. సెక్రటేరియట్‌లో ఇప్పుడిదే హట్ టాపిక్..!

TG Health Department: ఆ మేడం ఎక్కడ పనిచేసిన రిజెల్ట్ సూపర్.. సెక్రటేరియట్‌లో ఇప్పుడిదే హట్ టాపిక్..!
Advertisement

TG Health Department: స్వేచ్ఛ బ్యూరో: ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు ఏ శాఖలో పనిచేసినా.. లాంగ్ స్టాండింగ్‌లో ఉంటారని సెక్రటేరియట్ ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. గతంలో పనిచేసిన టూరిజం, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల నుంచి ప్రస్తుతం హెల్త్ వరకు ఆమె అత్యధిక రోజులు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సాధారణంగా ప్రభుత్వంలో రెండేళ్​లు పూర్తి చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లను సహజంగానే బదిలీలు చేస్తుంటారు. కానీ ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఒకే శాఖలో అత్యధిక కాలం పనిచేయడంతో ఐఏఎస్ ఆఫీసర్లలోనే హాట్ టాఫిక్ గా మారింది. గత ప్రభుత్వంలోనూ ఒక్కొక్క శాఖలో దాదాపు ఐదేళ్లకుపైనే పనిచేయగా, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇప్పటికే రెండేళ్లను సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. వైద్యారోగ్యశాఖ కు మూడో ఏడాది కూడా బాస్‌గా కొనసాగనున్నట్లు ఎంప్లాయిస్ చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీలు చేసింది. ఎప్పటికప్పుడు షప్లింగ్ చేస్తూ లాంగ్ స్టాండింగ్ పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకున్నది. కానీ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని మాత్రం మార్చకపోవడం గమనార్హం. ఇది సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లలోనూ చర్చంశనీయమైంది.

కారణం ఇదేనా..?

తెలంగాణ క్యాడర్ 2001 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాలో సెక్రటేరియట్ లో హెల్త్ శాఖకు బాస్ గా కొనసాగుతున్నారు. అయితే ఈమె గతంలో టూరిజంలో దాదాపు ఐదేళ్ల పాటు ఒకే కుర్చీలో పనిచేసినట్లు తెలిసింది. దీంతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ లోనూ సుమారు ఆరేళ్ల పాటు పనిచేశారట. ఇప్పుడు హెల్త్ శాఖలోనూ రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో ఏడాదిలో కొనసాగుతున్నారు. ఆమె పనితీరే ఇందుకు కారణంగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఆమే ఏ శాఖలో పనిచేసినా.. స్ట్రిక్ట్ గా ఉంటారనే పేరు ఉన్నది. ఆమె ఏ శాఖకు వెళ్లినా.. తనదైన ముద్ర వేస్తారనే చర్చ కూడా ఉన్నది. అంతేగాక పాలన పారదర్శకంగా అందించేందుకు ప్రయత్నిస్తుంటారని టాక్. రాజకీయ లీడర్ల నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా.. ఆమె తనకు ప్రభుత్వం కల్పించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారనే చర్చ ఉన్నది. రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తారనే చర్చ ఉన్నది. దీంతోనే ఆయ శాఖల్లో ఒక సారి బాధ్యతలు తీసుకుంటే ఏళ్ల తరబడి వర్క్ చేస్తూనే ఉంటారని ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆమె పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, లాంగ్ స్టాండింగ్ లో పనిచేస్తున్నా.. సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నది.

Advertisement

Also Read: High BP and Kidney Failure: కిడ్నీలు సురక్షితంగా ఉండాలంటే.. రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిందే!

ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి..

ఆమె వర్కింగ్ స్టైల్ ను సర్కార్ సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తూనే ఉన్నది. ప్రస్తుతం అతి ఎక్కువ ఉద్యోగులు కలిగిన శాఖల్లో ఒకటైన వైద్యారోగ్యశాఖకు బాస్ గా పనిచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో పాటు ఎమర్జెన్సీ శాఖ కావడంతో పాలన పరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల వంటి విషయాల్లో వేగంగా చర్యలు తీసుకొవాలి. కొన్ని విషయాల్లో ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలోనూ నిర్ణయాల అమలులో జాప్యం చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ఇక ఫైళ్లను సకాలంలో క్లియర్ చేసే పరిస్థితి లేదని స్వయంగా డాక్టర్లు, ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మాత్రం సంతృప్తి కరం వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగుల్లో మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాలు వినిపించడం గమనార్హం.

Advertisement

Also Read: TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×