Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.
Read also-భోపాల్‌లో ‘పెద్ది’ మ్యూజికల్ జాతర.. ఆ రోజు ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
రిషబ్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
తాజాగా ‘కాంతార’ ఫేమ్, కన్నడ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఈ ట్రైలర్‌ను చూసి ఫిదా అయ్యారు. ఆయన సోషల్ మీడియా వేదికగా సినిమా టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘పెద్ది ట్రైలర్ అద్భుతంగా (spectacular) కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా స్టన్నింగ్‌గా ఉన్నారు, ఆయన ప్రతి ఫ్రేమ్‌లోనూ ‘అబ్సల్యూట్ ఫైర్’ లాగా కనిపిస్తున్నారు.” అని రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. రామ్ చరణ్ రస్టిక్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read also-వైరల్ పోస్ట్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్.. ‘ఆ కంగారు నా గురించి కాదు’.. మరి దేనికంటే?
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా, క్రీడల నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.