Rizwan Vs Liton Das: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan ) మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. అయితే నాలుగో రోజు 437 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్, తడబడుతూనే ముందుకు సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 316 పరుగులు సాధించింది. మరో 121 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో మరో గొడవ తెరపైకి వచ్చింది. వికెట్ కీపర్ లిటన్ దాస్ తో (Litton Das) మహమ్మద్ రిజ్వాన్ (MOHAMMAD RIZWAN) గొడవకు దిగాడు. బ్యాటింగ్ చేయడం ఆపేసి మరి… రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అంపైర్… గొడవను సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత మ్యాచ్ యధావిధిగా ప్రారంభమైంది.
Also Read: Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సిల్హెట్ (Sylhet International Cricket Stadium, Sylhet) వేదికగా రెండో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రస్తుతం చేజింగ్ చేస్తోంది. 437 పరుగులను ఛేదించే క్రమంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. అయితే ఈ మ్యాచ్ నాలుగవ రోజు 72వ ఓవర్ సందర్భంగా మహమ్మద్ రిజ్వాన్, లిటన్ దాస్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. బౌలర్ ను ఆపేసి, సైడ్ స్క్రీన్ సెట్ చేయాలని మహమ్మద్ రిజ్వాన్ కోరాడు. అయితే ఈ నేపథ్యంలోనే నీ ఆటకు సైడ్ స్క్రీన్ సెట్టింగ్ కూడానా ? అంటూ దారుణంగా ట్రోల్ చేశాడు లిటన్ దాస్. దీంతో నీ కేంటి రా నొప్పి అన్నట్లుగా.. మహమ్మద్ రిజ్వాన్ రెచ్చిపోయాడు. దీంతో ఇద్దరు మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో కలుగజేసుకున్న అంపైర్.. ఇద్దరిని సముదాయించాడు. ఆ తర్వాత మ్యాచ్ యధావిధిగా ప్రారంభమైంది. అయితే ఎన్నడు లేని విధంగా ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఓవరాక్షన్ చేస్తున్నాడని లిటన్ దాస్ ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ తుది దశకు వచ్చేసింది. మరొక రోజు మాత్రమే మిగిలింది. ఈ టెస్ట్ నేపథ్యంలో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 278 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు సాధించారు. ఇక పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్ లో 232 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. నాలుగో రోజు ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 316 పరుగులు సాధించింది. చివరి రోజున 121 పరుగులు చేస్తే గెలుస్తుంది. అదే మూడు వికెట్లు పడగొడితే బంగ్లాదేశ్ విజయం సాధించనుంది. అయితే మహమ్మద్ రిజ్వాన్ 75 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతని వికెట్ తీస్తే బంగ్లాదేశ్ అవలీలగా విజయం సాధించనుంది.
🚨 HUGE VERBAL CLASH BETWEEN MOHAMMAD RIZWAN AND LITON DAS..!!! 🤯
– Rizwan was complaining about the side screen, Liton Das interfered and had an argument with Rizwan.
Litton Das: "Yeh kya kar rhe ho?"
Rizwan: "Woh dekh wo dekh wo khada hai"
Litton: "Udhar kya dekh rahe ho?… pic.twitter.com/6ZZUFcRQ4O
— Abdullah. (@Abdullahh_56) May 19, 2026