Rithu Chowdhary:రీతు చౌదరి (Rithu Chowdhary).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు సీరియల్స్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. జబర్దస్త్ (Jabardasth )లోకి వచ్చిన తర్వాత భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈమె…మరింతగా ఫాలోవర్స్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అవతారం ఎత్తి.. వరుసగా ప్రమోషన్లు చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తోంది.
హీరో ధర్మ మహేష్ బెడ్ రూమ్ లోకి వెళ్లిన రీతు చౌదరి..
దీనికి తోడు అప్పట్లో వైసీపీకి సన్నిహితంగా మెలిగిన శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అక్రమ ఆస్తుల కేసులో కూడా ఇరుక్కుంది. ఇప్పుడు భార్యను టార్చర్ చేస్తూ ఆమె వ్యాపారం లాక్కున్నట్టుగా కేసు నమోదైన హీరో ధర్మా మహేష్ (Dharma Mahesh) తో కూడా ఈమె తిరుగుతున్నట్టు కొన్ని సాక్షాలతో సహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. రీతు చౌదరిని ఇన్ని రోజులు అమాయకురాలు అనుకున్నాం.. కానీ ఇప్పుడు ఆమె బండారం బట్టబయలు అయింది అంటూ బహిరంగ పోస్టులు పెడుతూ ఉండడం గమనార్హం.
వీడియోలు వైరల్..
విషయంలో వెళ్తే .. రీతు చౌదరి – ధర్మ మహేష్ తో కలిసి అతని బెడ్ రూమ్ లోకి వెళ్లి .. తర్వాత డ్రగ్స్ తీసుకొని మత్తులో తూలుతూ బయటకి వస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన బుల్లితెర ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతోంది. వీరిద్దరి మధ్య నిజంగానే అనఫీషియల్ రిలేషన్షిప్ ఏదైనా ఉందా లేక డ్రగ్స్ కోసం కలిసారా? అనే విషయంపై కూడా చర్చ మొదలయ్యింది.
also read:OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?
ధర్మ భార్య చెబుతున్నది నిజమేనా..
మరొకవైపు ధర్మ మహేష్ భార్య గౌతమి కూడా గత కొద్ది రోజులగా మీడియా ముందుకు వచ్చి తన భర్త బండారం బయట పెడుతూ.. తన బాధను వెళ్ళబుచ్చింది.. ముఖ్యంగా ఎంతోమంది యాంకర్లు , సెలబ్రిటీలు తన భర్త బెడ్ రూమ్ కి వచ్చేవాళ్ళు అంటూ గౌతమి ఆరోపణలు చేసింది. అలాంటి ఆరోపణల మధ్య ఇప్పుడు రీతూ చౌదరి కి సంబంధించిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. దీన్ని బట్టి చూస్తే గౌతమి చెప్పేది నిజమే అంటూ కూడా కొంతమంది ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ నుంచి ఏ క్షణమైనా బయటకు రాక తప్పదా?
ఇక మరొకవైపు బయట ఎంత జరుగుతున్నా.. బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం ఒక ఎత్తు అయితే మరొకవైపు కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన డెమోన్ పవన్ తో కాస్త చనువుగా తిరగడం మరో ఎత్తు.. ఒకవేళ ఈ వీడియోలో ఉన్నది నిజంగానే డ్రగ్స్ వ్యవహారమే అయితే బిగ్ బాస్ షో మధ్యలో నుంచి కూడా ఈమెను బయటకు పంపే అవకాశాలు లేకపోలేదు అనడంలో సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో మునుముందు తెలియాల్సి ఉంది.
హీరోతో దొరికిపోయిన రీతు చౌదరి….
డ్రగ్స్ కూడా తీసుకుందట…
ఈ వీడియో వైరల్ అవుతుంది #Rithuchowdary #BiggBoss #Biggboss9telugu #BigGirlFall pic.twitter.com/d0tF2iDcBe— Megha (@MovieloverMegha) September 22, 2025