Brahmamudi serial today Episode: సుభాష్ ఆఫీసుకు వెళ్లమని రాజ్‌కు చెప్పగానే.. రాజ్ కోపంగా కంపెనీ ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది నన్ను వదిలేయండి అంటాడు రాజ్. దీంతో సుభాష్ కోపంగా అసలు ఏం మాట్లాడుతున్నావురా.. నీకేమైనా పిచ్చి పట్టిందా..? వందల కోట్ల ప్రాజెక్టురా అది అంటూ చెప్పగానే.. అసలు పిచ్చి పట్టింది నాకు కాదు మీకు.. మీకు పట్టింది డబ్బు పిచ్చి వేలు కోట్లు సంపాదించారు కదా ఇంకా సాటిఫై అవ్వలేదా.. ఇంకా ఎంత సంపాదిస్తే సాటిఫై అవుతారు.. ఈ భూమ్మీద పుట్టినందుకు కొద్దిరోజులైనా మన అన్న వాళ్ల కోసం బతకండి.. అన్నానికి బదులు డబ్బులు తింటామా..? అంటూ రాజ్ రూంలోకి వెళ్లిపోతాడు.
రాజ్ ఏంటి నాన్న మీద ఈగ కూడా వాలనిచ్చే వాడు కాదు. అలాంటి వాడే ఇన్నేసి మాటలు అనేసి వెళ్లిపోయాడు.. ఏదైతే ఏమీ ఈ అవకాశం వాడుకుందాం. అని మనసులో అనుకుంటూ సుభాష్ దగ్గరకు వెళ్లి అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని ఊరికే అన్నారా..? పెళ్లి అవగానే పేరెంట్స్ అల్లం అయ్యారు. పెళ్లాం బెల్లం అయింది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు అన్నయ్య రాజ్ అంత హార్స్ గా మాట్లాడి వెళ్లాడు. పెళ్లాం కడుపుతో ఉంది కేర్‌ఫుల్ గా చూసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్లను అని చెప్పాలి కానీ ఇంతలా తిట్టి వెళ్లాలా..? చూడండి అన్నయ్య ఎంతలా బాధపడతున్నాడో.. నువ్వేం బాధపడకు అన్నయ్యా పెళ్లాం వస్తే అంతే.. అని చెప్తుంటే.. ఇంద్రాదేవి కోపంగా నువ్వు నోరు మూయ్ చాన్స్ దొరికితే సరి దూరిపోతావు.. అంటుంది
ఇప్పుడు నేను ఏమన్నాను అమ్మా.. నువ్వు ముందు నోర్మూయ్.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తిట్టగానే.. రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంద్రాదేవి, సుభాష్ దగ్గరకు వెళ్లి వాడు ఏదో ఆవేశంలో తిట్టాడు నాన్న సుభాష్ నువ్వేమి పట్టించుకోకు అంటుంది. సుభాష్ మౌనంగా వెళ్లిపోతాడు. కవి గారు అసలే జరిగింది ఆయన ఎందుకు అలా ఉన్నారు అని కావ్య అడగ్గానే.. అది నాకు తెలియదు వదిన అంటాడు కళ్యాన్. ఇద్దరూ కలిసే కదా బయటకు వెళ్లి వచ్చారు కదా తెలియదు అంటావేంటి..? అని అడుగుతుంది. ఇందాక ఫోన్ వచ్చింది నాన్నమ్మ ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆలాగే కోపంగా ఉన్నాడు అని కళ్యాణ్ చెప్పగానే.. వెళ్లు వెళ్లి వాడికి ఏమైందో తెలుసుకుని రా అంటూ ఇంద్రాదేవి.. కావ్యను రూంలోకి పంపిస్తుంది.
రూంలో రాజ్ మరో డాక్టర్‌తో మాట్లాడుతుంటే.. కావ్య ఏమైందండి అని అడుగుతుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు. కవిగారేమో మీకు ఫోన్ వచ్చినప్పుడే ఇలా చేస్తున్నారు అని చెప్పారు అసలు మీ ప్రాబ్లం ఏంటండి చెప్పండి అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. దీంతో రాజ్ చెప్పలేను కళావతి నా ప్రాబ్లం నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డే అని చెప్పలేను అని మనుసులో అనుకుంటాడు. దీంతో కావ్య ఏంటండి ఆలోచిస్తున్నారు. నాతో చెప్పాలా వద్దా అనా..? సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదండి మామయ్య గారికి మాత్రం మీరు కచ్చితంగా సారీ చెప్పి తీరాలి. మీరు ఆయన మీద అకారణంగా కోప్పడి వచ్చేస్తే.. అయిపోయింది అనుకున్నారా..? ఆ తర్వాత ఆయన ఎంత బాధపడి ఉంటారు. ఎప్పుడూ తండ్రిని ఒక్క మాట అనని మీరు ఇలా సడెన్ గా అన్నేసి మాటలు అంటే ఆయన ఎలా తట్టుకుంటారు అనుకున్నారు. నాన్నే కదా భరిస్తారు అనుకున్నారా..? అంటూ చెప్తుంటే..
సారీ కళావతి ఏదో ప్రెస్టేషన్‌లో ఉండి ఆలోచించలేదు. అసలు నేను అలా మాట్లాడే రోజు వస్తుందని నేను అనుకోలేదు. పాపం నాన్న ఎంత మనసు ఎంత హర్ట్ అయి ఉంటుందో నేను ఊహించగలను.. పద కళావతి నాన్న దగ్గరకు వెళ్దాం పద నేను చేసిన తప్పుకు నాన్నకు క్షమాపణ చెప్పాలి పద అంటూ వెళ్తారు. గార్డెన్ లో సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అపర్ణ, సుభాష్‌ను ఓదారుస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి నాన్న నన్ను క్షమించండి.. మీకు నా మీద కోపం తగ్గే వరకు నన్ను కొట్టండి అంటూ కాళ్ల మీద పడబోతుంటే..
సుభాష్ ఆపేస్తాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు.. పిచ్చిగానీ పట్టిందా నీకు నేను నిన్ను కొట్టడం ఏంట్రా.. నువు బాధపడితే మేము కన్నీళ్లు పెట్టుకుంటామురా.. అలాంటిది నిన్ను ఎలా బాధపెడతానురా..? అంటూ హగ్ చేసుకుంటాడు. అసలు నీ బాధ ఏంటో చెప్పు అని అడుగుతాడు సుభాష్. కావ్య వచ్చి కూడా అవునండి మీ బాధేంటో చెప్పండి అని అడుగుతుంది. దీంతో చెప్పలేను టైం వచ్చినప్పుడే చెప్తాను. అప్పటి వరకు నన్ను ఈ విషయం గురించి అడిగి బాధపెట్టకండి అంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.