BigTV English

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

CM Progress Report: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో డెవలప్‌మెంట్‌ స్పీడప్ అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూ కొన్ని విషయాల్లో తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్నామని.. ఇకపై ఇదే సంకల్పంతో మరిన్ని పనులు చేస్తామంటున్నారు. దీనికి తగ్గట్టుగానే మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.


15-09-2025 ( సోమవారం ) ( కలెక్టర్ల సదస్సు డే-1 )
తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమర్థవంతమైన పాలనకు కలెక్టర్లు వెన్నుముక అన్నారు ఆయన. విజన్ స్వర్ణాంధ్ర-2047ను వికసిత భారత్-2047తో అనుసంధానించామని దీనిని ముందుకు తీసుకు వెళ్లడంతో.. వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. సమ్మిళిత సంక్షేమం, ఆర్థికవృద్ధి, మహిళా సాధికారతతోపాటు ప్రాంతీయ సమానత్వంతో సమర్థవంతమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.

16-09-2025 ( మంగళవారం ) ( సజీవ చరిత్ర-1984)
సజీవ చరిత్ర-1984 పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సీఎం.


16-09-2025 ( మంగళవారం ) ( కలెక్టర్ల సదస్సు డే-2 )
రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వృద్ధిరేటుపై రాజీ లేకుండా పనిచేయాలని, 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని ఆదేశించారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఈ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.

17-09-2025 (బుధవారం) ( విదేశీ ప్రతినిధులతో సీఎం )
సీఎం చంద్రబాబును నెదర్లాండ్‌ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులు కలిశారు. ఏపీలో పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు సీఎం. అడ్వాన్స్‌డ్ టెక్, స్టార్టప్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌పై వారికి వివరించారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ, మారిటైమ్ లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు.

17-09-2025 (బుధవారం) ( గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు )
విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖ వండర్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు సీఎం. అరకు కాఫీ అనగానే గుర్తొచ్చేది విశాఖేనన్నారు. విశాఖ ఆతిథ్యం ఎంతో ప్రత్యేకమైనదని ప్రశంసలు కురిపించారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలో తొలి స్థానంలో ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య రాష్ట్రంలో విశాఖలోనే ఎక్కువగా ఉందని తెలిపారు.

17-09-2025 (బుధవారం) ( స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ )
విశాఖలో స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోడీ సందేశాన్ని కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు, అధికారులతో కలిసి వీక్షించారు. తమ ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అన్నారు సీఎం చంద్రబాబు.

17-09-2025 (బుధవారం) ( బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం )
ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరిగే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. స్వామివారికి సంప్రదాయబద్దంగా పట్టువస్త్రాలు సమర్పించాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఇతర టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల వేదపండితులు సీఎంకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

18-09-2025 (గురువారం) ( అండగా ప్రభుత్వం )
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 35 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

19-09-2025 (శుక్రవారం) ( సంకల్పం నెరవేరింది )
సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును 1987లో ఎన్టీఆర్ సంకల్పించారని.. 1996 మార్చి 11న జీడిపల్లి వద్ద తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. 738 కిలోమీటర్ల దూరం మల్యాల నుంచి నేరుగా కుప్పం వరకూ తీసుకువెళ్లి నీళ్లు ఇచ్చామన్నారు సీఎం. ఈ ప్రాజెక్టు ద్వారా 498 మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపుతున్నామని.. 7 టిఎంసీల నీరు నిలిపే ఆరు రిజర్వాయర్లు పూర్తి చేశామన్నారు.

19-09-2025 (శుక్రవారం) ( 2027కు పూర్తి )
పోలవరం ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు ఒక్కటి కాదు భూ సేకరణ నుంచి కాంట్రాక్టర్ల లిటిగేషన్ ల వరకూ అన్నీ సమస్యలే ఉండేవని.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. 2019 నాటికి మొత్తం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశామన్నారు.

19-09-2025 (శుక్రవారం) ( కేబినెట్ నిర్ణయాలు )
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో.. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో 13 బిల్లులకు మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి వివిధ చట్టాలను సవరించాలనే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అమరావతి పరిధిలో 343 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సభలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

20-09-2025 (శనివారం) ( స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర )
పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక చెరువు వద్ద పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చెత్తను మొత్తం తొలగించి శుభ్ర పరిచారు. ఆ ప్రాంతంలో కూర్చునేందుకు సిమెంట్ బల్లలు వేసి, మొక్కలు నాటారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన పారిశుధ్య కార్మికులను సీఎం అభినందించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 88 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై ఉంచి వెళ్లిందన్నారు సీఎం చంద్రబాబు. గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో చెత్త మొత్తం క్లీన్ చేయాలని చెబితే మంత్రి నారాయణ, మునిసిపల్ శాఖ అధికారులు, పారిశుద్ధ్యం కార్మికులు ఎంతో శ్రమపడి నూటికి నూరు శాతం చెత్తను తీసివేశారన్నారు.

20-09-2025 (శనివారం) ( డబుల్ ఇంజిన్‌తో ప్రజలకు మేలు )
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు మరింత మేలు చేస్తున్నదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని.. ఇప్పుడు కేంద్రం జీఎస్టీ 5 శ్లాబులను 2 శ్లాబులుగా మార్చిందని గుర్తు చేశారు.. 99 శాతం వస్తువులు తక్కువ శాతం పన్ను కిందికి వచ్చాయన్నారు. ఆఇది నిజమైన దసరా, దీపావళి పండుగ.

20-09-2025 (శనివారం) ( 50 శాతం గ్రీన్ కవర్ )
స్వచ్ఛ ఆంధ్రా అంటే కేవలం రోడ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం మాత్రమే కాదని.. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అందుకు మనం చెట్లు పెంచాలన్నారు సీఎం. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం ‘గ్రీన్ కవర్’ ఉండాలి. ప్రస్తుతం 31 శాతం గ్రీన్ కవర్ ఉన్నది. రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 38 శాతానికి తీసుకువెళతాం. అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రతి మనిషి ఒక చెట్టు నాటితేనే గ్రీన్ కవర్ పెరుగుతుంది.

20-09-2025 (శనివారం) ( సంజీవని ప్రాజెక్ట్‌ )
అవినీతి లేకుండా 16 వేల 347 టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు సీఎం చంద్రబాబు. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని.. తద్వారా 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎన్నికల ముందు ఇవన్నీ చెప్పాను ఇప్పుడు చేసి చూపిస్తున్నానని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకువస్తున్నామన్నారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీలో అందరికి 2 లక్షల 50 వేల వరకు ఆరోగ్య బీమా ఉంటుందని.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకూ హెల్త్ కవరేజి ఉంటుందని తెలిపారు.

Story By Vamshi Krishna, Bigtv

Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×