Hyderabad Cybercrime: హైదరాబాద్ రాయదుర్గలోని వివిఫై ఇండియా ఫైనాన్స్ కంపెనీ..! డిజిటల్ ఫైనాన్స్ బిజినెస్‌లో ఉన్న ఈ సంస్థ బ్యాంక్ అకౌంట్‌నే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల 31 నిమిషాలకు మొదలైన మనీ గేమ్.. 11 గంటల 58 నిమిషాల వరకు సాగింది. కేవలం 87 నిమిషాల్లోనే 3కోట్ల 34లక్షల రూపాయలను కొట్టేశారు. అంటే ఒక్కో నిమిషానికి డబ్బు ఎటూ పోతుందో గుర్తించేలోపే.. ACCOUNT ఖాళీ చేస్తూ వెళ్లిపోయారు. అది కూడా రాయదుర్గలోని కంపెనీ నుంచి కాదు.. బేగంపేటలోని ICICI BANKలో ఉన్న కంపెనీ అకౌంట్ నుంచి మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.
కంపెనీ సిస్టమ్స్, API లోకి ఎవరో సైలెంట్‌గా దూరిపోయారు. పర్మిషన్ లేదు, పాస్ లేదు అయినా కంప్యూటర్లలో గేమ్ స్టార్ట్ చేశారు. వివిఫై కంపెనీ SYSTEMSలోకి.. APIలోకి UNAUTHORISED ACCESS జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంటే.. సరైన పర్మిషన్ లేకుండానే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా మనీ ట్రాన్సఫర్స్ మొదలుపెట్టారు.
కంపెనీ CFO చిరాగ్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదుతో TGCSB రంగంలోకి దిగింది. ఇక డబ్బు ఎక్కడికి వెళ్లిందో TRACK చేస్తే.. మల్టీపుల్ ACCOUNTS కనిపిస్తున్నాయి. 52 బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి. ఆ ACCOUNTలు ఎవరు తెరిచారు..? డబ్బు ఎవరు DRAW చేశారు..? ప్రతి TRANSACTIONను BACKTRACK చేస్తున్నారు సైబర్ పోలీసులు. ఇప్పటికే 40 లక్షల రూపాయలను FREEZE చేశారు.! కానీ.. మిగిలిన కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి..? అవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి..? అక్కడే ఈ CASEలో అసలు ట్విస్ట్ దాగుంది..!
ఇప్పుడు పోలీసుల అనుమానం మరోవైపు కూడా TURN అయ్యింది. ఏదైనా CYBER GANG ఈ పని చేసిందా..? లేదంటే కంపెనీ లోపలి వాళ్లే HAND ఇచ్చారా..? ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ప్రస్తుతం కంపెనీలో CYBER AUDIT కొనసాగుతోంది. అంటే SYSTEMలో ఏ చోట నుంచి ENTRY వచ్చింది. ఎవరి ACCESS ద్వారా MONEY MOVE అయింది.. అన్నది చెక్ చేస్తున్నారు.
Also read: తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?