Romanchakam Box Office:అర్జున్ రెడ్డి ,యానిమల్ సినిమాలతో సత్తా చాటి నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన సందీప్ రెడ్డి వంగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి చేసిన సినిమా ‘రోమాంచకం’.
సుమంత్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రోమాంచకం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ళని కొల్లగొడుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు అంతా .
ఇకమొదటి రోజు పర్లేదనిపించే వసూళ్లని రాబట్టిన సినిమా రెండో రోజుకు వచ్చేసరికి మాత్రం కలెక్షన్లు కాస్త డౌన్ అయినట్టుగా ట్రేడ్ వర్గాల నుంచి లెక్కలు వినిపిస్తున్నాయి.
అవును వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘రోమాంచకం’ రెండో రోజు ఇండియా మార్కెట్‌లో సుమారు రూ.55 లక్షల నెట్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అదే మొదటి రోజు విషయానికి వస్తే దాదాపు రూ.1.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. అంటే ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి.
ఇక రెండు రోజులు కలిపితే సినిమా ఇండియా నెట్ కలెక్షన్ సుమారు రూ.2.05 కోట్లకు చేరినట్టు అంచనా. ఇక గ్రాస్ లెక్కల్లో చూస్తే ఈ మొత్తం దాదాపు రూ.2.40 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ‘రోమాంచకం’కు మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు రెండో రోజు కూడా కలెక్షన్లు సాలిడ్ గానే వస్తాయని లెక్కలేశారు ట్రేడ్ పండితులు .కానీ శుక్రవారం తర్వాత రెండో రోజు మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు కనిపించలేదని థియేటర్ల వద్ద జనాలని చూస్తేనే తెలుస్తుంది.
ఈలెక్కన ఈ వీకెండ్ వసూళ్లపైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారన్న మాట.మాములుగాసాధారణంగా చిన్న సినిమాలకు శనివారం, ఆదివారం కలెక్షన్లు చాలా ముఖ్యం .
మొదటి రెండు రోజులు సోసో గా వసూళ్లు వచ్చినా వీకెండ్‌లో ఆడియన్స్ థియేటర్లకు వస్తే సినిమా మళ్లీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సినిమా బాగుంది అన్న పాజిటివ్ మౌత్ టాక్ వస్తే కలెక్షన్లలో వేగం మాములుగా ఉండదు.
సుమంత్ ప్రభాస్‌కు యూత్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ‘మేమ్ ఫేమస్’ తర్వాత గోదారి గట్టున సినిమాని ఆడియన్స్ గట్టున పెట్టేసినా రోమాంచకం’కి మాత్రం బజ్ బాగానే ఏర్పడింది.అయితే ఆ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్లుగా మారుతుందన్నదే ఇక్కడ అసలు మ్యాటర్ .
ఇప్పటి వరకు చూస్తే సినిమాకు పూర్తిగా బ్యాడ్ సిట్యుయేషన్ అయితే లేదనే చెప్పాలి. రెండు రోజుల్లో రూ.2 కోట్లకు పైగా నెట్ రావడం చిన్న విషయం కాదు. కానీ మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోవడం మాత్రం కాస్త మేకర్స్ కి ఆందోళన కలిగించే విషయం.
Also read :డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!
చూడాలి మరి సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కి తగ్గట్టుగా డీసెంట్ వసూళ్ళని ఏమైనా వెనకేస్తుందో !