E-Paper
Advertisement

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!
Advertisement

AP DSC: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీఎస్సీ.. ఉపాధ్యాయ నియామ‌కంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై BIGTV కథనాలు ఏపీ రాజ‌కీయాల‌కు కుదిపేశాయి. ఉన్న‌దున్న‌ట్టుగా.. వాస్త‌వాల‌ను వెలికి తీసే క్ర‌మంలో జ‌రిగిన ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిజానికి అంత‌టా నీరాజ‌నాలు ప‌లుకుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మెటాకు నోటీసులిచ్చింది. బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపివేసేలా చేసింది. చేతిలో అధికారం ఉంది క‌దా అని.. అర‌చేతిని అడ్డుపెట్టి సూర్య‌కాంతిని ఆపిన‌ట్టు.. వాస్త‌వాల‌ను వెలికితీసి, బాధితుల‌కు అండ‌గా నిలిచిన వైనం త‌మ పాల‌న‌కే మచ్చ అని భావించిన‌ట్టున్నారు పాల‌కులు. ఇది ప్ర‌తిప‌క్షానికి అస్త్రంగా మారుతుంద‌నే భ‌య‌మే కానీ, బాధితుల ప‌క్షం మాత్రం వ‌హించేందుకు సిద్ధంగా లేదు. పైగా ఏ మీడియా తీసుకోని ఓ డేర్ స్టెప్‌తో బాధితుల ప‌క్షాన నిలిచి పోరాడుతున్న బిగ్‌టీవీపై ప్ర‌తాపం చూపి, ప్ర‌పంచానికి ఆ నిజాలు తెల‌య‌కుండా చేయాలనే భ్ర‌మ‌లో .. మీడియా స్వేచ్చ‌ను కాల‌రాసేందుకు కూడా వెనుకాడ‌లేదు ఏపీ సర్కారు..

బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్..

ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్న బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపేయ‌డానికి త‌గిన కార‌ణాలు లేవు. కానీ చ‌ట్ట‌బ‌ద్ద సూచ‌న అనే సాకు వెతుక్కున్నారు. ఇచ్చిన క‌థ‌నాలు, ప్ర‌సార‌మైన వార్త‌లు.. అన్నీ జ‌ర్న‌లిజం నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఉన్నాయి. ఇది నిఖార్సైన జ‌ర్న‌లిజానికి ఓ మ‌చ్చు తున‌క‌. కానీ త‌మ మ‌చ్చ‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే భ‌యంతో టీవీ మీద ముసుగేస్తే చాలనే నిప్పుకోడి బాప‌తు తెలివిని ప్ర‌ద‌ర్శించి .. చ‌వ‌క‌బారు ఎత్తుగ‌డ‌ను ప్ర‌యోగించింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఏ మీడియా కూడా ఉన్న‌దున్న‌ట్టుగా..అదీ అధికార పార్టీకి ఎదురు నిలిచి వాస్త‌వాల‌ను ప్ర‌సారం చేయ‌డం లేద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. నిఖార్స‌యిన జ‌ర్న‌లిజం మ‌స‌క‌బారుతున్న‌వేళ .. బిగ్ టీవీ రూపంలో బాధితుల‌కు అండ‌గా నిలిచిన తీరు..అంద‌రి జేజేలందుకుంటున్న‌ది. నిజంగా ఇది ప్లాంటెడ్ స్టోరీనా? ఉద్దేశపూర్వ‌కంగా ఎత్తుకున్న టాపికా..? ఆ ప్ర‌సారాలు చూస్తే జ‌ర్న‌లిజం మీద క‌నీస అవ‌గాహ‌న కూడా లేని సాధార‌ణ వ్య‌క్తులెవ‌రైనా చెబుతారు.

Advertisement

Also read: బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

తెర‌వెనుక ప‌న్నాగాలు..

బాధితుల ప‌క్షాన ఆధారాలు కూడా క‌ళ్ల‌కు క‌న‌బ‌డుతున్నాయ‌ని. మ‌రి అధికార పార్టీ క‌ళ్ల‌కు ఇది క‌న‌బ‌డ‌లేదా అంటే..? త‌మ‌నే ప్ర‌శ్నించే స్థాయి ఏ మీడియాకు ఇక లేద‌నే భ్ర‌మ‌లో ఉన్న పాల‌కుల‌కు ఇది మింగుడు ప‌డ‌టం లేదు. అందుకే అధికారం దారులు వెతికింది. బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపేసే శ‌క్తిగా తెర‌వెనుక ప‌న్నాగాలు ప‌న్నింది. ఇలా భ‌య‌పెట్టొచ్చ‌నుకున్నారో.. లేక ఇలాంటి జ‌ర్న‌లిజానికి పుల్ స్టాప్ పెట్ట‌క‌పోతే.. మీ అంతు చూస్తామ‌నే బెదిరింపు అందులో దాగుందో తెలియ‌దు. కానీ.. ఇక్క‌డ ఉన్న బిగ్ టీవీ బెదిరింపుల‌కు లొంగే, అణిచివేత‌కు భ‌య‌ప‌డే మీడియా హౌజ్ కాద‌నే విష‌యం తెలుసుకోవ‌డ‌మే ఇక ఏపీ స‌ర్కార్‌కు మిగిలుంది. త‌ప్పులు జ‌రుగుతాయి. వాటిని స‌రిదిద్దుకుని పోవ‌డం, బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌డం, ప్ర‌తిప‌క్షాల‌కు భ‌య‌ప‌డ‌కుండా జ‌వాబుదారీ పాల‌న అందిండ‌చమే ప్ర‌జారంజ‌క పాల‌న అవుతుంది.

Advertisement

Also read: సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

Tags

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×