Champion Event : ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలోని చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా ఈవెంట్లో రోషన్ మేక ఎమోషనల్ స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం అనేది మొదటి సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే పనికొస్తుంది. అయితే ఆ సినిమాతోని టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే ఈ రోజుల్లో చాలామంది తమకంటూ ఒక సొంత గుర్తింపు సాధించుకొని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు.
చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగచైతన్య వంటి ఎంతోమంది హీరోలు తమకంటూ ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటున్నారు. ఇంకొంతమంది హీరోలు తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం రోషన్ మేక ఛాంపియన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటాడేమో చూడాలి.
రోషన్ మేక ఛాంపియన్ సినిమా ఈవెంట్లో వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా ఈవెంట్ ఈరోజు జరుగుతుంది అన్నప్పుడు నాన్న నువ్వు రావాలి అని అంటే. నేను ఈవెంట్ కి వస్తానో రానో తెలీదు నీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలిరా అని చెప్పారు. ఒకవేళ నేను వచ్చినట్లయితే ఆ స్పీచ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ మాట్లాడారు. నేను ఫోకస్ అవుతాను అన్నారు.
కానీ ఇప్పుడు చెప్తున్నాను నాన్న నువ్వే నా ఐడెంటిటీ అంటూ తేల్చి చెప్పాడు రోషన్ మేక. అలానే నీ వలన నాకు చాలా మంది వ్యక్తులు పరిచయమయ్యారు వాళ్ళందరిలో కూడా మోస్ట్ లవబుల్ బ్రదర్ రామ్ చరణ్ తేజ్ అంటూ మాట్లాడారు రోషన్.
ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ముందు ముందు చాలా జరగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలానే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఈవెంట్ వైజాగ్ లో జరగబోతున్నట్లు కూడా స్పీచ్ లో క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Ram Charan : ఛాంపియన్ సినిమా మగధీర అంత హిట్ అవ్వాలి