E-Paper
Advertisement

Honor 32GB RAM: సూపర్ స్పీడ్ ఫోన్.. 10,000mAh బ్యాటరీ, 32GB ర్యామ్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ

Honor 32GB RAM: సూపర్ స్పీడ్ ఫోన్.. 10,000mAh బ్యాటరీ, 32GB ర్యామ్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ
Advertisement

Honor 32GB RAM| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో హానర్ కంపెనీ ఫోన్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. గేమింగ్ ఫోన్స్‌కు ఇది పెట్టింది పేరు. తాజాగా హానర్ బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఫోన్స్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ ఉంటాయి. హానర్ విన్ మరియు హానర్ విన్ ఆర్‌టి. వీటిని డిసెంబర్ 26న అధికారికంగా లాంచ్ ఈ సూపర్ స్పీడ్ ఫోన్లు విడుదల కానున్నాయి. హానర్ విన్ మోడల్ మరింత శక్తివంతమైన హార్డ్‌వేర్, ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్‌లు ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించినవి, ఎక్కువ బ్యాటరీ లైఫ్, హై పర్ఫార్మెన్స్‌తో సెగ్మెంట్ ను టార్గెట్ చేస్తాయి.

అధికారిక వివరాలను బయటపెట్టిన లీక్స్

లాంచ్‌కు ముందు హానర్ విన్ మోడల్ కీ స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీబోలో ఒక యూజర్ “అబౌట్ ఫోన్” ఇమేజ్ షేర్ చేశాడు. హానర్ ఇంజినీర్ దాన్ని రీపోస్ట్ చేయడంతో ఈ లీక్ నిజమే అని నమ్మకం కలిగింది. ఈ వివరాలు ఫైనల్ ప్రొడక్షన్ మోడల్‌కు సరిపోతాయని అంచనా.

భారీ 10,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ

Advertisement

హానర్ విన్‌లో 10,000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండవచ్చు. ఇది సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కంటే చాలా పెద్దది. ఈ బ్యాటరీతో ఎక్కువసేపు స్క్రీన్ టైమ్, హెవీ యూసేజ్ సాధ్యమవుతుంది. గేమర్లు, ట్రావెలర్లు, పవర్ యూజర్లకు ఇది చాలా ఉపయోగకరం. యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఉండడంతో ఫోన్ హీటింగ్ సమస్యను చాలా తక్కువ.

లోపల ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

లీక్ ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంటుంది. ఇది టాప్-లెవల్ పర్ఫార్మెన్స్, మంచి ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ టాస్క్‌లు స్మూత్‌గా నడుస్తాయి. హానర్ విన్‌ను నిజమైన పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ డివైస్‌గా పొజిషన్ చేస్తోంది.

డిస్‌ప్లే, రిజల్యూషన్ వివరాలు

Advertisement

హానర్ విన్‌లో 6.83 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉండవచ్చు. 1.5కె రిజల్యూషన్ (2800 x 1272 పిక్సెల్స్) ఓఎల్‌ఇడి డిస్‌ప్లే ఇస్తుంది. ఇది షార్ప్ విజువల్స్, ఇమ్మర్సివ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. హై రిఫ్రెష్ రేట్ కూడా ఉండడడంతో గేమింగ్ మరింత స్మూత్ అవుతుంది.

ర్యామ్, పర్ఫార్మెన్స్ సెటప్ ఎలా ఉంటుంది?

గరిష్టంగా 16జీబీ ఎల్‌డీడీఆర్5ఎక్స్ అల్ట్రా ఫిజికల్ ర్యామ్ ఉంటుంది. అదనంగా 16జీబీ వర్చువల్ ర్యామ్ కూడా జత చేసి మల్టీటాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది. అంటే మొత్తంగా ఫోన్‌లో 32GB ర్యామ్ ఉంటుంది. హానర్ సొంత సీ1+ ఆర్‌ఎఫ్ చిప్, ఈ2 పవర్ ఎఫిషియెన్సీ చిప్‌లు సిగ్నల్ స్టెబిలిటీ, బ్యాటరీ సేవింగ్ మెరుగుపరుస్తాయి.

కెమెరా అంచనాలు

వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. మిగతా కెమెరాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. డిసెంబర్ 26న లాంచ్‌లో పూర్తి కెమెరా స్పెసిఫికేషన్స్ వెల్లడవుతాయి.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? దీనికి కారణం అదే.. ఈ సెట్టింగ్స్ మార్చండి

కలర్ వేరియంట్స్, లభ్యత

బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుంది. రెండు మోడల్స్ ఇప్పటికే హానర్ చైనా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. డిసెంబర్ 26 లాంచ్ టైమ్‌లైన్ కూడా కన్ఫర్మ్ అయింది.

మొత్తంగా ఫోన్ అంచనాలు

హానర్ విన్ సిరీస్ పర్ఫార్మెన్స్ ఇష్టపడే కస్టమర్లను టార్గెట్ చేస్తుంది. భారీ బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణలు. ధర పోటీతత్వంగా ఉంటే మార్కెట్‌లో బాగా ఆకర్షిస్తుంది. అధికారిక వివరాలు లాంచ్ ఈవెంట్‌లో తెలుస్తాయి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×