Gorati Venkanna Songs:తెలంగాణ జానపదాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన గోరటి వెంకన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తనదైన ఎన్నో పాటలతో తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపిన గోరటి వెంకన్న పాడిన ఫేమస్ పాటలేంటో, ఆయన పాటకి తీసుకున్న పారితోషికం ఎంతో ఒకసారి చూసేద్దాం.
పుట్టింది నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో
గోరటి వెంకన్న విషయానికి వస్తే ఆయన పుట్టింది నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో . ఇక పెరిగిన వాతావరణం కారణంగా చిన్నప్పటి నుండే పాటలు పాడుతూ పెరిగిన వెంకన్న కలం నుండి ఎన్నో అధ్బుతమైన పాటలు జాలు వారాయి.ముఖ్యంగా ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతుందో పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు,కుబుసం సినిమాలో వచ్చిన ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంగా ఆయన రాసిన గల్లీ చిన్నది గరీబోల్ల కథ పెద్దది పాటకి కాలు కదపని వారు లేరంటే ఆశ్చర్యం లేదు.
పాటల విషయానికి వస్తే
ఇక ఆయన రాసిన పాటల విషయానికి వస్తే ‘నీ పాట ఏమాయెరో’.. నీ మాట ఏమాయరో’,’వాగు ఎండిపాయెరో’,’ఓ నల్ల తుమ్మ,కంచె రేగి తీపివోలె’,’జిలేడమ్మ,వన్నొచ్చెనమ్మ’,’రేలా దూలా’,’సంత.. మా ఊరి సంత’,’అద్దాల అంగడి’,’యలమంద’,’ఇద్దరం విడిపోతే’, ‘తరమెల్లిపోతున్నదో’,’రేలా దూలా సాలెల్లాడే నేల నా తెలంగాణ’,’రాజ్య హింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు’,
‘అందుకోరా గుతుపందుకో.. ఈ దొంగల తరిమేటందుకు’,’పోమంటే పోవేరా’,’బతుకమ్మ బతుకమ్మ’,’మండెంత పోతుందే యల్లమం’ద అంటూ రాసిన పాటలు ఎన్నో పాపులర్ అయ్యాయి. వీటిలో రాసే పదాలలో జీవితం ఉట్టిపడటమే ఈయన పాటలు ఎక్కువ మంది ఇష్టపడటానికి ఒక కారణం అని చెప్పాలి.
‘వల్లంకి తాళం’కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ఇక ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసేంద్రవంక’, ‘పూసిన పున్నమి’, ‘వల్లంకి తాళం’ వంటి రాతలు కూడా ఆయన కలం నుండి జాలు వారిన వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాలి.ఇవన్నీ మనిషి ,మానవ సంబంధాలు,ప్రకృతి ,పల్లె వంటి వాటి చుట్టూ తిరగడం ఆయన కలం స్పెషాలిటీగా చెప్పాలి.వీటిలో మరీ ముఖ్యంగా ‘వల్లంకి తాళం’కి 2021 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం చాల గొప్ప విషయం.ఇక రేలా రే రేలా లో ఈయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.ఒక రకంగా ఈయన వల్లే షో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పాలి.
ఒక పాటకి ఏకంగా 8 లక్షల పారితోషికం
ఇక ప్రస్తుతం రాజకీయాల్లో mlc గా ఉన్న వెంకన్న పారితోషికం విషయానికి వస్తే గతంలో ఒక పాటకి ఏకంగా 8 లక్షల పారితోషికం తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.ఇక ఇప్పుడు కూడా అడపాదడపా పాటలు రాస్తున్న గోరటి ఒక్కో పాటకి ఒకటి నుండి మూడు మధ్య తీసుకుంటున్నట్టు సమాచారం.అయితే ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్త గానే పరిగణించాలి. ఇందులో నిజానిజాలేంటో వెంకన్నే బయట పెడితే కాని తెలీదు !
ALSO READ :బండారి పూజిత క్రేజ్ మామూలుగా లేదుగా.. నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా?