E-Paper
Advertisement

ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!

ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!
Advertisement

Honey Trap: స్వేచ్చ బ్యూరో: అమ్మాయిల పేర్లతో వల విసురుతూ పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడి లక్షలు కొల్లగొట్టిన కిలాడీని సైదాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుని హనీట్రాప్​ లో చిక్కుకున్న వారిలో ఓ పోలీస్​ అధికారితోపాటు డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ ఉండటం గమనార్హం. చార్మినార్ జోన్​ డీసీపీ ఖారే కిరణ్​ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అమ్మాయిల పేర్లతో..

కూకట్​ పల్లి బాలాజీనగర్ వాస్తవ్యుడైన కొండబత్తుల పవన్​ కుమార్ (23) నిరుద్యోగి. కాగా, జల్సా జీవితంపై మక్కువతో దానికి కావాల్సిన డబ్బు కోసం మోసాలు చేయాలని పవన్​ కుమార్​ పథకం వేశాడు. దాని ప్రకారం ఫేస్​ బుక్​, ఇన్ స్టాగ్రామ్​ లలో అమ్మాయిల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించాడు. వీటి ద్వారా వేర్వేరు వ్యక్తులకు ఫ్రెండ్, ఫాలో రిక్వెస్ట్‌‌లు పంపించాడు. ప్రొఫైల్​లో అందమైన యువతుల ఫోటోలను చూసి ఎవరైనా స్పందించగానే వారితో అమ్మాయిలా చాటింగ్ ప్రారంభించేవాడు. కొన్నిరోజులు గడిచాక సెక్సువల్ చాట్​ చేస్తూ అవతలి వారిని పూర్తిగా తన కంట్రోల్​ లోకి తెచ్చుకునేవాడు. ఆ తర్వాత ఇతరుల నగ్న చిత్రాలను పంపించి బాధితుల నుంచి వారి నగ్న ఫోటోలను సేకరించేవాడు. ఇలా సేకరించిన నగ్న ఫోటోలు, వీడియోలను తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు ఇతర సోషల్ మీడియా ఖాతాలలో భద్రపరిచేవాడు.

అన్నయ్యగా..

Advertisement

ఆ తరువాత అమ్మాయి అన్నయ్యనంటూ బాధితులతో కాంటాక్ట్ లోకి వెళ్లవాడు. వాట్సాప్​ కాల్స్​, మెసేజీలు చేస్తూ ఉచ్ఛులో పడ్డవారి నగ్న ఫోటోలు, వీడియోలను చూపించి తన చెల్లితో పోలీసులకు ఫిర్యాదు చేయిస్తానని బెదిరించేవాడు. కొన్నిసార్లు బాధితులను నేరుగా కలిసి భయపెట్టేవాడు. ఇలా వెయ్యి మందితో చాటింగ్​ చేసిన నిందితుడు తన ఉచ్ఛులో చిక్కిన 82మంది నుంచి 25.16లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. ఇతని బాధితుల్లో ఆంధ్రప్రదేశ్​, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్​ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు దుబాయ్, టర్కీ, పాకిస్తాన్​, కెనడా దేశాలకు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.

కోల్​ కతాకు చెంది..

నిందితున్ని జరిపిన విచారణలో కోల్‌కతాకు చెందిన చందన అనే యువతిఫోటోలను ఉపయోగించి ఎక్కువగా మోసాలు చేసినట్టుగా వెల్లడైంది. నిందితుడి వద్ద డిప్లొమా చదివిన ఓ యువకుడు ఇలాగే హనీట్రాప్​ లో చిక్కుకుని 4లక్షలు పోగొట్టుకోగా అదే పద్దతిలో డబ్బు సంపాదించాలని పవన్ కుమార్​ ఈ పన్నాగం పన్నినట్టుగా తేలింది. నిందితుని నుంచి రెండు మొబైల్​ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, పెన్​ డ్రవ్​ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును పర్యవేక్షించిన అదనపు డీసీపీ మహ్మద్ మజీదం, సైదాబాద్ ఏసీపీ సోమ వెంకట్​ రెడ్డితోపాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Advertisement

Also read: ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు.. మహిళ దుర్మరణం

Tags

Related News

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌లో నకిలీ నెంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. 100 కేసులు, వాహనాలు సీజ్!

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై భట్టి సంచలన ఆదేశాలు.. వెనుకబడిన శాఖలపై ఫోకస్!

ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు.. మహిళ దుర్మరణం

Big Stories

Advertisement
×