E-Paper
Advertisement

పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?

పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?
Advertisement

Mahesh Babu -S.J.Suriya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు సినీ కెరియర్ విషయానికి వస్తే ఈయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక మహేష్ తన కెరియర్ లో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రయోగాత్మక సినిమాలలో “నాని” సినిమా కూడా ఒకటి.

ఎస్ జె సూర్య డైరెక్షన్ లో మహేష్ బాబు..

మహేష్ బాబు హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు కం నటుడు ఎస్. జె సూర్య మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ప్రస్తుతం ఎస్ జె సూర్య సర్దార్ 2(Sardar 2) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తెలుగు తమిళ భాషలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగులో నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు..

ఖుషి సినిమా హీరోలు సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు..

Advertisement

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెలుగు హీరోలు నటించిన ఖుషి, నాని సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సూర్య మాట్లాడుతూ తాను ఖుషి తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేశాను ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. తమిళంలో విజయ్ తో చేశాను అక్కడ సీఎం అయ్యారు అంటూ మాట్లాడటంతో వెంటనే మనోజ్ మా ఇద్దరితో సినిమా ఎప్పుడు చేస్తున్నారు. ఇందులో ఎవరు డిప్యూటీ సీఎం అవుతారు ఎవరు సీఎం అవుతారంటూ చమత్కరించారు. సూర్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఖుషి సినిమా సక్సెస్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నప్పటికీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఇప్పటికీ బాధ ఉందని తెలిపారు.

Advertisement

మహేష్ బాబు నటించిన నాని సినిమాకు సూర్య డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . దీంతో ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాని ఆదరించలేకపోయారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కాకపోవడంతో ఇప్పటికీ మహేష్ బాబుకి హిట్ ఇవ్వలేకపోయాను అనే బాధ నాకు ఉందని తెలిపారు. ఇలా ఇద్దరు హీరోలు మినహా తెలుగులో ఎస్ జె సూర్య ఏ హీరోతోనో దర్శకుడిగా సినిమాలు చేయలేదని చెప్పాలి. ఇటీవల కాలంలో ఈయన డైరెక్టర్ గా కాకుండా నటుడిగా పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సర్దార్ 2 సినిమా విషయానికి వస్తే పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సర్దార్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

Related News

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

Big Stories

Advertisement
×