Amit Mishra On Virat Kohli : టీమిండియా ఒకప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని (Virat Kohli) ఉద్దేశించి అమిత్ మిశ్రా (Amit Mishra) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చాలా మంది ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని బాంబు పేల్చారు. జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో? ఎందుకు కొత్త వాళ్లను తీసుకుంటున్నారు? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా విరాట్ కోహ్లీ వ్యవహరించాడని అమిత్ మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. దాని వల్ల చాలా మంది సీనియర్ క్రికెటర్లకు అన్యాయం జరిగిందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. కోహ్లీ వ్యవహారం వల్ల, సదరు క్రికెటర్ల కెరీర్లు నాశనం అయినట్లు గుర్తు చేశారు. దీంతో అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
అమిత్ మిశ్రా… మహేంద్ర సింగ్ ధోనీ సమయంలోనే జట్టులోకి వచ్చి అత్యుత్తమ బౌలర్ గా ఎదిగారు. అనిల్ కుంబ్లే తరహాలో టీమిండియా జట్టులో కొనసాగుతూ ఎన్నో వికెట్లు పడగొట్టాడు మిశ్రా. అలాంటి మిశ్రా ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తూ.. రిలాక్స్ అవుతున్నారు. అలాంటి అమిత్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ ని మెచ్చుకుంటూ… విరాట్ కోహ్లీని కించపరుస్తూ మాట్లాడారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చాలా మంది యంగ్ క్రికెటర్లకు అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కెరీర్లు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ధోని అంటూ వ్యాఖ్యానించారు.
2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడు స్థానం ఖరారు కాగా… వరల్డ్ కప్ కిట్స్ కూడా అతని ఇంటికి పంపించారు. కానీ చివరి క్షణంలో అతనిని దుర్మార్గంగా తప్పించారని ఫైరయ్యారు అమిత్ మిశ్రా. దీనిపై కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గం అన్నారు. అలాగే ఇదే టోర్నమెంట్ నేపథ్యంలో యువరాజు సింగ్ కు కూడా అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించాలని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరు విషయంలో విరాట్ కోహ్లీ ఒక్క మాట మాట్లాడకుండా జట్టులో నుంచి తొలగించారని సీరియస్ అయ్యారు.
తన విషయంలో కూడా చాలా సార్లు విరాట్ కోహ్లీ ఇలాగే వ్యవహరించాడని మండిపడ్డారు. ఒక ప్లేయర్ ను జట్టు నుంచి తొలగిస్తున్నామంటే.. కెప్టెన్ గా బాధ్యతాయుతంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు. కానీ రవి శాస్త్రి అటు విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి అప్పట్లో దుర్మార్గంగా వ్యవహరించి జట్టును కుదేలు చేశారని ఫైర్ అయ్యారు. అందుకే 2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు.