S.S.Rajamouli: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో బాహుబలి(Bahubali) ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటీవల బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)పేరిట బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా సుమారు 53 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఈ బాహుబలి ది ఎపిక్ సినిమా జపాన్(Japan) లో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ హీరో ప్రభాస్ సైతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఇక ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ అభిమానులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్ కు ఒక స్పెషల్ లెటర్ రాశారు. ఈ సందర్భంగా రాజమౌళి ప్రభాస్ జపాన్ పర్యటనపై స్పందిస్తూ…”జపాన్ లో ఉన్న అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. ఇప్పటివరకు జపాన్ కు తాను నాలుగు సార్లు వెళ్లాను వెళ్లిన ప్రతిసారి అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడిగేవారు. ప్రభాస్ ఎప్పుడు వస్తారు? అని మాత్రమే అడిగేవారు వారి కోరిక నేడు ఫలించింది”అని చెప్పుకు వచ్చారు.
ఇక ఈ లెటర్ లో భాగంగా రాజమౌళి జపాన్ ను తన రెండవ ఇల్లుగా భావిస్తూ.. చివరికి నా బాహుబలి నా రెండవ ఇంటికి వచ్చాడు నేను జపాన్ వెళ్ళిన ప్రతిసారి ఎంతో అనుభూతిని పొందుతాను మీరు కూడా ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను. జపనీస్ స్నేహితులందరికీ మీ అందరి ప్రేమ..అరిగాటో గోజైమాసు అంటూ ఒక ఎమోషనల్ లెటర్ రాస్తూ షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టును షేర్ చేస్తూ లవ్ యూసో మచ్ డార్లింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ కోసం రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే జపాన్ లో బాహుబలి ది ఎపిక్ విడుదల కానున్న నేపథ్యంలో కొద్ది రోజులు స్పిరిట్ సినిమాకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ లుక్ అందరి ఎంతగానో ఆకట్టుకుంటుంది. బహుశా ఈ లుక్ స్పిరిట్ సినిమాలోదేనేమో అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పిరిట్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు.
Also Read: Akhanda 2: ఆంధ్ర కింగ్ తాలూకా సీన్ రిపీట్…అఖండ కోసం రూ.4 కోట్లు ఇచ్చిన అభిమాని!