E-Paper
Advertisement

Rohit Sharma: తెలుగు ఫ్యాన్స్ అరాచ‌కం… బాల‌య్య రేంజ్ లో కోపంతో ఊగిపోయిన రోహిత్ శ‌ర్మ !

Rohit Sharma: తెలుగు ఫ్యాన్స్ అరాచ‌కం… బాల‌య్య రేంజ్ లో కోపంతో ఊగిపోయిన రోహిత్ శ‌ర్మ !
Advertisement

Rohit Sharma: మన దేశంలో ఎక్కువమంది అభిమానులు ఉన్న క్రికెటర్లలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒకరు. ముంబైలోనే కాకుండా రోహిత్ శర్మకు తెలుగు రాష్ట్రాలలోనూ భారీ అభిమాన గణం ఉంది. తాను ఒక లెజెండరీ క్రికెటర్, సెలబ్రిటీ అనే గర్వం రోహిత్ శర్మలో అస్సలు కనిపించదు.

Also Read: Odi Matches: వన్డే క్రికెట్ టైమింగ్స్ చేంజ్.. ఇకపై 11:30 AM మ్యాచ్ స్టార్ట్?

Advertisement

తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుండే రోహిత్ శర్మ.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించిన సరదాగానే ఉంటాడు. మైదానంలో అప్పుడప్పుడు గంభీరంగా కనిపించే రోహిత్ శర్మ.. బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. కానీ అతిగా ఇబ్బంది పెడితే అప్పుడప్పుడు సీరియస్ కూడా అవుతుంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన తాజాగా చోటుచేసుకుంది.

 

కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ:

Advertisement

రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డే అనంతరం.. మూడవ వన్డే కోసం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో మరోసారి తనలోని ఫన్నీ యాంగిల్ ని బయటపెట్టాడు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో రోహిత్ శర్మ చేసిన ఓ సరదా పని ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ విమానాశ్రయం బయటకు వచ్చిన వెంటనే.. భారత ఆటగాళ్లు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అయితే అక్కడికి వచ్చిన అభిమానులను నిరాశ పరచకుండా రోహిత్ శర్మ వారందరితో సెల్ఫీలు దిగాడు. ఈ క్రమంలో అభిమానులంతా ఒక్కసారిగా సెల్ఫీలు దిగేందుకు ఎగబడడంతో.. ఏ కెమెరా వైపు చూడాలనే విషయం రోహిత్ శర్మకు అర్థం కాలేదు. దీంతో ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఫ్యాన్స్, విలేకరులు నవ్వు ఆపుకోలేకపోయారు. అలా సెల్ఫీలు దిగుతూ రోహిత్ శర్మ.. ఆ అభిమానుల వైపు చూసే చూపులు ఇంటర్నెట్ లో మీమ్ లుగా మారిపోయాయి. దీంతో ఈ వీడియో కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ దాటేసింది.

 

భారీ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. నేడు విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ వన్డే మ్యాచ్ లో మరో 27 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. దీంతో ఈ గణత సాధించిన నాలుగవ భారత ప్లేయర్ గా రికార్డులకు ఎక్కుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ {34,357}, విరాట్ కోహ్లీ {27,910}, రాహుల్ ద్రావిడ్ {24,064} లు మాత్రమే ఉన్నారు.

Also Read: Eng Vs Aus: ఆస్ట్రేలియా కొంపముంచిన Ms ధోని… వికెట్ సమర్పించుకున్న స్మిత్

ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 54 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 67 టెస్ట్ లు, 278 వన్డేలు, 159 టీ-20 లు ఉన్నాయి. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 19,973 పరుగులు చేశాడు. టెస్టుల్లో 4301, వన్డేల్లో 11,441, టి-20 ల్లో 4,231 పరుగులు సాధించాడు. వీటిలో మొత్తంగా 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×