E-Paper
Advertisement

Akhanda 2: అఖండ2 రూ.250 కోట్లు పక్కా.. జోస్యం చెప్పిన తమన్.. తేడా కొట్టిందో అంతే!

Akhanda 2: అఖండ2 రూ.250 కోట్లు పక్కా.. జోస్యం చెప్పిన తమన్.. తేడా కొట్టిందో అంతే!
Advertisement

Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Balakrishna)హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ 2(Akhanda 2). ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ముంబైలో ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. అఖండ తాండవం అంటూ సాగిపోయే ఈ పాటను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చిత్తబృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.

చూడగానే హగ్ ఇచ్చేవారు…

ఇక అఖండ 2 సినిమాకు ఎస్ఎస్ తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే స్పీకర్లు బద్దలు ఇవ్వడం ఖాయమని స్పష్టం అవుతుంది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తమన్ ఈ సినిమా గురించి భారీ స్థాయిలో అంచనాలు పెంచేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ గారితో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న రోజులన్నీ కూడా బాలయ్య గారు తాను కచ్చితంగా కలిసే వాళ్ళమని నన్ను చూడగానే బాలయ్య గారు ఒక హాగ్ ఇస్తారు అలాగే కిస్ కూడా ఇస్తారని తెలిపారు.

రూ.25o కోట్లు గ్యారెంటీ..

Advertisement

ఈ సినిమా గురించి కూడా మాట్లాడుతూ కచ్చితంగా అఖండ సినిమా 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భగవంతుడి దయవల్ల నాకు 400 కోట్ల సినిమా కూడా వచ్చిందని అలాగే అఖండ 2 , రూ.250 కోట్లు పక్కా అంటూ ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేస్తున్న అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను పెంచడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుపుకుంది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఈ టార్గెట్ రీచ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే మరి కొంతమంది ఈ సినిమాపై అంత కాన్ఫిడెంట్ ఎందుకు భయ్యా ఏ మాత్రం తేడా కొట్టిందో అంతే సంగతులు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అఖండ పార్ట్ 5..

Advertisement

ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూడు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక అఖండ 2 పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తమన్ ఈ సినిమా సీక్వెల్స్ గురించి కూడా కామెంట్స్ చేశారు. అన్ని సినిమాలకు పార్ట్2, పార్ట్ 3 ఉంటుంది కానీ ఆఖండకు మాత్రం పార్ట్ 5 కూడా ఉంటుంది అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Also Read: Suma -Rajeev Kanakala: పెళ్లయి 25 ఏళ్ళు… సుమ దగ్గర ఆ విషయం దాచిన రాజీవ్..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×