Sai Pallavi Bikini: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సాయి పల్లవి(Sai Pallavi) ఒక్కరు. ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి పల్లవి సినిమాలలో నటించిన ఎంతో నిండుతనంతో కనిపిస్తుంటారు. ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా ఈమె సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.
తన వస్త్రధారణ విషయంలో ఎక్కడ విమర్శలకు గురికాకుండా కెరియర్ పరంగా ముందుకు కొనసాగుతున్న సాయి పల్లవికి సంబంధించి ఇటీవల కొన్ని బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీచ్ లో ఈమె బికినీ (Bikini)ధరించి కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సాయి పల్లవి కూడా అందరిలాంటి హీరోయిన్ అని, సినిమా అవకాశాల కోసమే ఇలా బికిని ధరించింది అంటూ కూడా విమర్శలు కురిపించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే సాయి పల్లవి స్కిన్ షో స్టార్ట్ చేసింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేశారు.
సాయి పల్లవి ఇలా బికినీలో కనిపించడంతో ఎంతోమంది ఈమెను రామాయణ సినిమా నుంచి కూడా తొలగించాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేశారు. అయితే సాయి పల్లవి బికినీ ఫోటోలు నిజం కాదని అదంతా కూడా ఏఐ మహిమ అంటూ క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని సాయి పల్లవి తాజాగా బికినీ ఫోటోలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఈమె తన సోదరితో కలిసి ట్రిప్ వెళ్లిన మూమెంట్స్ కొన్ని షేర్ చేసుకున్నారు.
?igsh=MzE4djE5OXc5Z2Fk
ఇక ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “ఇక్కడ తీసిన ఫోటోలన్నీ నిజంగానే తీసినవి ఏఐ ఫోటోలు కాదు” అంటూ ఈమె ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇలా క్యాప్షన్ ఇవ్వడంతో తన బికినీ ఫోటోలు నిజం కాదని అవన్నీ కూడా ఏఐతో క్రియేట్ చేసినవని సాయి పల్లవి చెప్పకనే చెప్పేశారు. ఇలా సాయి పల్లవి స్పందనతో బికినీ ఫోటోలపై క్లారిటీ రావడంతో నిప్పులాంటి సాయి పల్లవిని అనుమానించారు కదారా అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మీరేంటో మాకు తెలుసు అంటూ ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సాయి పల్లవి సినీ కెరియర్ విషయానికి వస్తే తెలుగులో చివరిగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ(Ramayana) సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
Also Read: Rishabh shetty: జై హనుమాన్ అద్భుతం… షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్!