IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా ఇప్పటికే ఫైనల్ జట్లు ఖరారైన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించి ఫైనల్ కి చేరిన తొలిజట్టుగా భారత్ నిలిస్తే.. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లను ఓడించి ఫైనల్ చేరిన రెండో జట్టుగా పాకిస్తాన్ చేరింది. అయితే ఫైనల్ మ్యాచ్ గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇండియాలోని పీవీఆర్ థియేటర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా ఫైనల్ మ్యాచ్ ను 100 థియేటర్లలో మ్యాచ్ లైవ్ వీక్షించే అవకాశాన్ని కల్పించారు.
ఈ నిర్ణయంతో టీమిండియా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. థియేటర్ లో పాక్-ఇండియా మ్యాచ్ సంబురాలు జరుపుకోవచ్చని పేర్కొంటున్నారు. కానీ ఫైనల్ లో ఈసారి చాలా రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలై చాలా కసి మీద ఉంది పాకిస్తాన్ జట్టు. రెండు సార్లు విజయం సాధించామని.. ముచ్చటగా మూడో సారి కూడా మేమే విజయం సాధిస్తామని భారత్ ధీమాతో ఉంటే.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించి పాకిస్తాన్ సత్తా ఏంటో చూపించాలని ఆశిస్తుంది. కానీ వాస్తవానికి టీమిండియానే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లీగ్ దశలో జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో పోటీ ఇవ్వలేకపోయింది. కానీ సూపర్ 4లో జరిగిన మ్యాచ్ లో మాత్రం హోరా హోరీ పోరు సాగనుంది.సెప్టెంబర్ 28 ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఆదివారం అంటేనే భారత్ కి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. లీగ్ దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న ఆదివారం రోజే జరిగింది. అలాగే సెప్టెంబర్ 21న ఆదివారం రోజే సూపర్ 4లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లన్నింటిలో కూడా పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైంది. కానీ ఫైనల్ మ్యాచ్ ఫలితం మరోలా ఉంటుందని పాకిస్తాన్ ఆటగాళ్లు పేర్కొంటే.. ఫైనల్ లో ఎలాగైనా టీమిండియానే గెలుస్తుందని ఇండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కి మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ వంటి సీనియర్లు ప్రత్యేకంగా టీమిండియా పై విజయం సాధించాలంటే ఏం చేయాలి..? ఎలా ఆడాలి అని సూచనలు ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు కాసుకోండి. ఈ ఆదివారం పాకిస్తానే విజయం సాధిస్తుందని అక్తర్ సంచలన కామెంట్స్ కూడా చేశాడు. అలాగే టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ని కేవలం 2 ఓవర్లలోపే ఔట్ చేస్తే.. పాకిస్తాన్ జట్టు విజయం సాధించినట్టు గ్యారెంటీ అని పేర్కొన్నాడు. టీమిండియా అబిమానులు మాత్రం టీమిండియా అంటే కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ వంటి స్టార్ బ్యాటర్లున్నారు. వీరందరినీ ఔట్ చేయాలంటే.. పాకిస్తాన్ కి చాలా కష్టమే. వీరిలో ఏ ఇద్దరూ ఆటగాళ్లు నిలకడగా ఉన్నా టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. అని పాకిస్తాన్ కి సెటైర్లు వేశారు.
🚨 ASIA CUP 2025 FINAL IN CINEMAS 🚨
– PVR INOX will show the India Vs Pakistan Final in this Asia Cup 2025 across 100+ screens in India. (Gaurav Gupta/TOI). pic.twitter.com/GJd1n8EKTv
— Tanuj (@ImTanujSingh) September 26, 2025