Rishabh shetty: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతార చాప్టర్ 1 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ రెండో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రిషబ్ శెట్టి జై హనుమాన్ (Jai Hanuman) సినిమా గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించిన చిత్రం హనుమాన్(Hanuman) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా చివరిలో హనుమంతుడు పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.
హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించినట్లు అనంతరం చిత్ర బృందం వెల్లడించారు. ఇక జై హనుమాన్ సినిమాలో రిషబ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి రిషబ్ మాట్లాడుతూ.. నిజానికి తాను కాంతార1 తరువాత వేరే సినిమా చేయాలనుకున్నాను కానీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ గురించి చాలా అద్భుతంగా నేరేట్ చేశాడని, ఆయన నెరేట్ చేసే విధానం నచ్చి తాను ఈ సినిమాని రిజెక్ట్ చేయలేకపోయానని తెలిపారు.
ప్రీ ప్రొడక్షన్ పనులలో జై హనుమాన్..
జై హనుమాన్ సినిమా కథ చాలా అద్భుతంగా ఉందని, ప్రస్తుతం ఫోటోషూట్ పూర్తి అయ్యిందని అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయంటూ రిషబ్ శెట్టి జై హనుమాన్ గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఇక హనుమాన్ సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాకుండా ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా ఏకంగా మూడు కేటగిరీలలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక కాంతార 1 విషయానికి వస్తే రిషబ్ రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ సినిమా భూతకోల నృత్యం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా హోం భలే నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Also Read: The Paradise Film: నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్… ఇది అస్సలు ఊహించలేదుగా!