Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న రాత్రి పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం సంభవించింది. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఒకే గొడుగు కిందికి వెళ్లారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఇండియా కి శత్రువులే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ ఫిర్యాదు మేరకు సాహిబ్జాదా ఫర్హాన్ ఐసీసీ విచారణకు హాజరయ్యారు. హాఫ్ సెంచరీ చేశాననే సంతోషంలో అలా చేశానని తెలిపారు. గతంలో ధోనీ, కోహ్లీ కూడా ఇలాగే గన్ యాక్షన్ లతో సంబురాలు జరుపుకున్నారు. నేను పఠాన్ ని.. మాప్రాంతంలో జరిగే వేడుకల్లో తుపాకులు సర్వసాధారణం అని చెప్పారు.
Also Read : Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !
మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 135 పరుగులు చేసింది. కేవలం 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది పాకిస్తాన్ జట్టు. ఆ తరువాత ఒక్కక్కరూ వరుస కట్టారు. ముఖ్యంగా కేవలం 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు ఓడిపోవడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా చివర్లో హారిస్ రవూఫ్, మహ్మద్ నవాజ్ చెలరేగారు. రవూఫ్ 31, నవాజ్ 25, షాహిన్ అఫ్రిది 19 పరుగులు చేయడంతో పాకిస్తాన్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ సాధించి విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు ఓడిపోతుందని అంతా భావించారు. ముఖ్యంగా శ్రీలంక పై 168 పరుగులను ఛేజ్ చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడూ కూడా అలాగే వ్యవహరిస్తుందని అంతా భావించారు.
కానీ పాకిస్తాన్ స్పిన్నర్ల దాటికి బంగ్లా బ్యాటర్లు ఎక్కువగా క్రీజులో నిలువలేకపోయారు. మరోవైపు పాకిస్తాన్ ఫీల్డర్లు చాకచక్యంగా వ్యవహరిస్తే.. ఇంకా తక్కువ స్కోర్ కే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసేది. బంగ్లాదేశ్ వాళ్లు కూడా చాలా చెత్తగా ఫీల్డింగ్ చేశారు. షాహిన్ అఫ్రిది క్యాచ్ ని మూడు సార్లు మిస్ చేశారు బంగ్లా ఆటగాళ్లు. మరోవైపు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ లో షాహిన్ అఫ్రిది బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతిని తౌహిద్ హృదయ్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సయిమ్ అయూబ్ బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాడు. కానీ అప్పటికే మరో ఎండ్ లో ఉన్న సైఫ్ హాసన్ తౌహిద్ హృదయ్ వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్ట్రైకర్ ఎండ్ లో ఉండగా.. అయూబ్ బౌలర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. మిస్ ఫీల్డ్ అయింది. బంతిని అందుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. మిడాన్ లో ఉన్న ఫీల్డర్ వచ్చి బంతిని అందుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. మిడాన్ లోఓ ఉన్న ఫీల్డర్ వచ్చి బంతిని అందుకోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో చెప్పుకోదగ్గ స్కోర్ ఎవ్వరూ చేయలేకపోయారు. సైఫ్ హాసన్ 8, తౌహిద్ హృదయ్ 5, షమీమ్ హోసెన్ 30 పరుగులు చేశాడు. బంగ్లాపై విజయం సాధించిన పాక్.. సెప్టెంబర్ 28న టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది.
?igsh=MmU5YzIwNWdlaGFx