Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సౌత్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. త్వరలోనే సాయి పల్లవి(Sai Pallavi) నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం రామాయణ(Ramayana) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నవంబర్ 5వ తేదీ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిపల్లవి కౌన్ బనేగా కరోడ్ పతి 18(kaun banega crorepati) కార్యక్రమంలో నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామాయణ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి సీత పాత్రలో(Sita Role) నటించడం గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
సాధారణంగా తనకు ఏదైనా ఒక సినిమాలో చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా తాను ఆ పాత్రకు ఎంతవరకు చేయగలను అనే విషయాల గురించి ఆలోచన చేస్తాను కాని రామాయణ సినిమాలో సీత పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం తాను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాకు ఓకే చెప్పానని సాయి పల్లవి తెలిపారు. ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత తాను మొదటి రోజు షూటింగ్లో పాల్గొన్నప్పుడు సీతమ్మ పాత్ర కోసం ప్రత్యేకంగా తాను ఏమీ ప్లాన్ చేసుకోలేదని అమ్మ నాతో ఈ పాత్ర నువ్వే చేయించుకో అని సీతమ్మ తల్లిని ప్రార్థించానని సాయి పల్లవి తెలిపారు. ఈ విధంగా సాయి పల్లవి సీత పాత్ర గురించి చేసిన ఈ కామెంట్స్ పట్ల అమితాబ్(Amithab Bachchan) మంత్రముగ్ధుడై సాయి పల్లవిని ప్రశంసించారు.
ఇక ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సుమారు నాలుగువేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. మొదటి భాగాన్ని ఈ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో సాయి పల్లవి సీతగా నటించగా రణబీర్ కపూర్ రాముడి పాత్రలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి రామాయణ సినిమా ద్వారా సాయి పల్లవి ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!