E-Paper
Advertisement

మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Vijay Devarakonda -Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూనే తమ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్న ఈ జంటపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. విజయ్ రష్మిక రణబాలి సినిమా (Ranabaali Movie)ప్రమోషన్లలో భాగంగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.

100 కాదు 1000 సార్లు ప్రపోజ్ చేస్తా..

ఇందులో భాగంగా రష్మిక (Rashmika) ఒక సంవత్సరం పాటు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోమని ఒక వంద సార్లు అడిగానని అంటూ మాట్లాడటంతో చాలామంది విజయ్ దేవరకొండ పై విమర్శలు కురిపించడమే కాకుండా వీరిద్దరూ విడాకులు(Divorce) తీసుకోబోతున్నారు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇలా విజయ్ రష్మికల వ్యక్తిగత జీవితం గురించి నిరాధారణమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ ఆయన అంటే నాకు చాలా ఇష్టం 100 సార్లు కాదు 1000 సార్లు ప్రపోజ్ చేస్తా మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

భగవంతుడి ఆశీస్సులతో ఆనందంగా ఉన్నాం..

Advertisement

రష్మిక మందన్నతో పాటు విజయ్ దేవరకొండ సైతం ఈ వార్తలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ రష్మికతో కలిసి దిగిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ..”నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా సర్వస్వం. నా జీవితంలో నేను సరిగ్గా ఎంచుకున్న అత్యంత అందమైన భాగం ఆమె. మా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ చెబుతున్నా… మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులతో చాలా ఆనందంగా గడుపుతున్నామని ఒకవేళ తాము ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తే అందుకు కూడా తాను సిద్ధమేనని తెలిపారు. నిజమైన ప్రేమను, సాధారణంగా ఆనందంగా జీవించే జీవితాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ నా బిగ్ లవ్. ఇక మిగిలిన వాళ్లందరికీ.. ఏ మాత్రం గౌరవం లేకుండా చెబుతున్నాను పక్కకెళ్ళి (f*** Themselves) అంటూ విజయ్ చేసిన పోస్ట్ మాత్రం పంచలనంగా మారింది.

Advertisement

ఇలా విజయ్ రష్మిక రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను వీరిద్దరూ ఖండించడమే కాకుండా తమ మధ్య చాలా మంచి అనుబంధం ప్రేమ ఉందని జీవితాంతం ఇలాగే ప్రేమతో కొనసాగుతాము అంటూ వీరిద్దరూ విమర్శలు చేసే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ స్పందించడంతో వీరి రిలేషన్ కి సంబంధించిన వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ జంట రణబాలి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రష్మిక మరోవైపు మైసా రిలీజ్ పనులలో కూడా బిజీ అవుతున్నారు.

Also Read: భార్యకు సర్జరీ వెక్కి వెక్కి ఏడ్చిన అలీ..అసలేం జరిగిందంటే?

Related News

నజ్రియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

అమ్మా నువ్వే చేయించుకో… సీతమ్మ పాత్ర చేయడం పై సాయి పల్లవి కామెంట్స్!

నాలోనే ఆ సమస్య ఉందనుకున్నాను – కీర్తి సురేష్

భార్యకు సర్జరీ వెక్కి వెక్కి ఏడ్చిన అలీ..అసలేం జరిగిందంటే?

కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!

విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!

Big Stories

Advertisement
×