E-Paper
Advertisement

విచిత్ర వేడుక.. జీవితాంతం పెళ్లి వద్దంటూ ప్రేమికుల గ్రాండ్ సెలబ్రేషన్

విచిత్ర వేడుక.. జీవితాంతం పెళ్లి వద్దంటూ ప్రేమికుల గ్రాండ్ సెలబ్రేషన్
Advertisement

Ceremony of Non Marriage Proposals| ప్రేమలో ఉన్న ప్రతి జంట పెళ్లి చేసుకోవాలనే నియమం ఉందా? జీవితాంతం కలిసి ఉండాలంటే పెళ్లి బంధమే అవసరమా? ఈ ప్రశ్నలకు కొత్త కోణంలో సమాధానం చెబుతోంది ఓ ప్రత్యేక వేడుక. పెళ్లి చేసుకోకుండానే తమ ప్రేమను, అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొంత మంది లవర్స్ ఈ వేడుకలో సందడి చేశారు. సంప్రదాయ పెళ్లిళ్లకు భిన్నంగా జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పెళ్లి వద్దనుకునే జంటల కోసం పారిస్‌లో ప్రత్యేక వేడుక

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని చారిత్రక ప్రాంతమైన మోంట్‌మార్ట్రేలో అక్టోబర్ 11న ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్లాస్ డెస్ అబ్బెస్సెస్ వద్ద నిర్వహించిన ఈ వేడుకకు సెరిమనీ ఆఫ్ నాన్ మ్యారేజ్ ప్రపోజల్స్ అని పేరు పెట్టారు. నగరంలో జరిగిన 93వ ఫెట్ డెస్ వెండాంజెస్ డి మోంట్‌మార్ట్రే ఉత్సవాల్లో ఇది కూడా భాగమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. అయితే, ఇక్కడ సంప్రదాయ పెళ్లి ప్రమాణాలు, నిశ్చితార్థపు ఉంగరాలు కనిపించలేదు. వాటికి బదులుగా ప్రేమను, అనుబంధాన్ని తెలియజేసే సరదా ప్రతిజ్ఞలు చేశారు. పారిస్‌లోని 18వ అరోండిస్మెంట్ మేయర్ ఎరిక్ లెజోయిండ్రే ఈ వేడుకకు అధ్యక్షత వహించారు.

పెళ్లి వద్దనుకునే ఆలోచనకు కారణం ఇదే

Advertisement

ఈ ప్రత్యేక సంప్రదాయం వెనుక ఫ్రెంచ్ గాయకుడు జార్జెస్ బ్రాసెన్స్ రచించిన ఓ పాట ప్రేరణగా నిలిచింది. లా నాన్ డిమాండ్ ఆన్ మారియాజ్ అనే ఈ పాట ట్రెడిషన్నల్ పెళ్లి ప్రతిపాదనలపై సరదాగా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రేమను నిరూపించుకోవడానికి పెళ్లి తప్పనిసరి కాదనేది ఈ కార్యక్రమంలోని ప్రధాన భావన. సమాజం నిర్దేశించిన పద్ధతిలోనే ప్రతి సంబంధం ముందుకు సాగాల్సిన అవసరం లేదని ఇది గుర్తుచేస్తుంది. సాధారణంగా ప్రేమ, నిశ్చితార్థం, పెళ్లి, కుటుంబ జీవితం ఒకదాని తర్వాత మరొకటి వస్తాయని చాలామంది భావిస్తారు. అయితే, ప్రతి ఒక్కరూ ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని లేదు. కొందరు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించాలని కోరుకుంటారు.

Also Read: చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ప్రేమకు పెళ్లి తప్పనిసరిగా అవసరమా?

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పెళ్లికి ప్రాధాన్యం ఇస్తారు. సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మతపరమైన నమ్మకాలు, చట్టపరమైన ప్రయోజనాలు దీనికి కారణాలు కావచ్చు. అదే సమయంలో, మరికొందరు తమ సంబంధాన్ని అధికారిక వివాహంగా మార్చుకోవడానికి ఇష్టపడరు. అయితే, పెళ్లి చేసుకోకపోవడం అంటే ప్రేమకు లేదా బాధ్యతలకు దూరంగా ఉండాలని అర్థం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం, భవిష్యత్తు గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవడం కూడా బలమైన బంధానికి గుర్తులే.

ప్రతి ప్రేమకథకు ఒకే నియమం ఉండాల్సిన అవసరం లేదు

పారిస్‌లో జరిగిన ఈ వేడుక పెళ్లిని వ్యతిరేకించడం కోసం నిర్వహించినది కాదు. బదులుగా, ప్రతి జంట తమకు నచ్చిన విధంగా సంబంధాన్ని నిర్వచించుకోవచ్చనే సందేశాన్ని అందిస్తోంది.
కొంతమందికి పెళ్లి చేసుకుని 7 అడుగులు వేయడం ప్రేమకు గుర్తు. మరికొందరికి పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండటం ప్రేమకు అర్థం. చివరికి, బంధం విలువను నిర్ణయించేది పెళ్లి వేడుక మాత్రమే కాదు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యం.

Also Read: పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

Related News

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

Big Stories

Advertisement
×