E-Paper
Advertisement

Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య
Advertisement

1. సీఎం సమావేశం

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, పీసీసీ చీఫ్‌ సమావేశమయ్యారు. ఈనెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు.

2. గ్రీన్ ట్యాక్స్ పెంచాం

ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. డీజిల్ ఆటోలను కూడా రెట్రోఫిట్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు. పదిహేనేళ్లు పైబడిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని.. 30 వేల రూపాయలకు గ్రీన్ ట్యాక్స్ పెంచామని ఆయన పేర్కొన్నారు.

3. సంక్షేమానికి పెద్దపీట

Advertisement

సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కార్మికులందరికీ ప్రమాద భీమా కోటి రూపాయలు వచ్చేలా చేశామన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్రక్రియ ప్రారంభించామన్నారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్‌ ల్యాబ్‌ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

4. తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన

తెలంగాణ విద్యాశాఖ తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మన ఊరు-మన బడి పనులకు సంబంధించి 360 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంపై ఆయన మండిపడ్డారు. నిధుల విడుదల కోసం ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

5. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

Advertisement

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ 8వ రోజుకు చేరింది. 300 వార్డుల్లోని గార్బేజ్ పాయింట్ల నిర్మూలన, వ్యర్థాల తొలగింపు పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పౌరులు సహకరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రీన్ సిటీ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

6. బీజేపీ నాయుకుల ధర్నా

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఓటరు జాబితాలో భారీగా తప్పులు దొర్లాయని, అనర్హులైన ఫేక్ ఓటర్ల పేర్లు ఉన్నాయని వారు ఆరోపించారు. తక్షణమే జాబితాను సరిచేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ నిరసనతో మున్సిపల్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

7. మాజీ మంత్రి డిమాండ్

సోయాబీన్ పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టిన బంద్ కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. భారీ బైక్ ర్యాలీలతో నిరసనలు వెల్లువెత్తాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

8. మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా కట్టకిందపల్లిలో దారుణం జరిగింది. వివాహిత నాగజ్యోతిని ఏఆర్ కానిస్టేబుల్ సీనావలి కొట్టి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సీనావలి ఆమెపై అత్యాచారం చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

9. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఆధిపత్య పోరు

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. ఈవో తీరుపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే విద్యుత్ అధికారులతో ఘర్షణ నెలకొనగా, తాజా పరిణామాలు ‘పవర్ పంచాయితీ’గా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సీఎంవో దృష్టికి చేరింది.

10. లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా

కర్ణాటకలోని సంధ్య థియేటర్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాను గమనించిన మహిళా ప్రేక్షకులు, బాధ్యుడైన థియేటర్ సిబ్బందిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

11. బోటు బోల్తా పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునళ్తాడలో విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చెక్క గోపాలరావు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో బోల్తా పడటంతో ఆయన మృతి చెందారు. అలల ఉధృతి వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గోపాలరావు మరణంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

12. ఉర్సు ఉత్సవాలు

వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్‌లో యాకుబ్ షావలి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మత పెద్దల ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు నిర్వహించి, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

13. భారీ ప్రమాదం

కోనసీమ జిల్లా ఇరుసమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా భారీ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సుమారు 500కు పైగా కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఈ బ్లో అవుట్ ప్రభావంతో చుట్టుపక్కల ఉన్న కొబ్బారి తోటల్లో వేడి తీవ్రత పెరిగి, కొబ్బరి బోండాలు నేల రాలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

14. ఫ్లెక్సీ వివాదం

గుంటూరు జిల్లా తెనాలిలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీ వ్యవహారంపై..
టీడీపీ నాయకులు వర్సెస్ మున్సిపల్ అధికారులు అన్నట్లుగా పరిస్థితి మారింది. వాహబ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఆలపాటి ఫ్లెక్సీ తొలగించాలన్నారు మున్సిపల్ అధికారులు. అయితే.. గత ప్రభుత్వంలో గుర్తుకు రాని నిబంధనలు..ఇప్పుడు గుర్తుకొచ్చాయా అంటున్నారు టీడీపీ నేతలు. ఫ్లెక్సీ ముందు బైఠాయించి టీడీపీ నాయకుల నిరసన తెలుపుతున్నారు.

15. కూటమి పాలనపై మాజీ మంత్రి రోజా ఫైర్

ఏపీలోని కూటమి పాలనపై ఫైరయ్యారు మాజీ మంత్రి రోజా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారామె. నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు రోజా. వైసీపీ హయాంలో తప్పుడు కేసులు నమోదు చేయలేదని..వేధింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చిన ఆమె.. కూటమి హయాంలో మాత్రం పోలీస్ శాఖ ఖాకీ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకున్నారని ఆరోపించారు.

16. ముఖ్య ఉద్దేశం

వెనియెజువెలా నేత నికోలస్‌ మదురోను తాము నిర్బంధించడాన్ని సమర్థించుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మన్రో సిద్ధాంతం గురించి ప్రస్తావించారు. పశ్చిమార్ధగోళ దేశాల్లో ఐరోపా జోక్యాన్ని నివారించి, అమెరికా ప్రాబల్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. కాలక్రమంలో థియోడర్ రూజ్‌వెల్ట్ వంటి అధ్యక్షులు దీన్ని మరింత విస్తరించి, లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని సమర్థించుకోవడానికి, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాడుకున్నారు.

17. మచాడో స్పష్టం

వెనియెజువెలా బాధ్యతలు చేపట్టడంపై ట్రంప్‌తో తాను ఎలాంటి చర్చలు జరపలేదని ప్రతిపక్ష నేత మచాడో స్పష్టం చేశారు. మదురో నిర్బంధాన్ని స్వాగతించిన ఆమె, త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు వెల్లడించారు. ట్రంప్‌తో గత అక్టోబర్‌లోనే చివరిసారి మాట్లాడానని, అధికారం కోసం సంప్రదింపులు జరపలేదని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.

18. సోనియా గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిన గాలి కాలుష్యం కారణం గానే ఆమె అనారోగ్యం బారినపడ్డట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రమే ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

19. సరికొత్త రికార్డులు

టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ యూత్ వన్డేల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో యూత్ వన్డేలో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాది, ఈ ఘనత సాధించిన ఉమ్మడి మూడో వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 24 బంతుల్లో 68 పరుగులు చేయగా.. అందులో 60 పరుగులు కేవలం సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం.

20. బిజీ బిజీగా

నటి త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నా, గత ఏడాది ఆమెకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన భారీ చిత్రాలు ‘విశ్వంభర’, ‘కరుప్పు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త సినిమాలేవీ లేవని ప్రచారం జరుగుతున్నా, 2026లో తన సినిమాలు భారీ విజయాలు సాధిస్తాయని త్రిష ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×