E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?

Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం తన వృత్తిపరమైన విషయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చ్ 26 తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar Reddy) డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

పవన్ సినిమాలో ఏజెంట్ బ్యూటీ..

పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి అద్భుతమైన కథను నేరేట్ చేయటంతో పవన్ కళ్యాణ్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా ఎంపిక అయ్యారని తెలుస్తోంది.

పవన్ జోడిగా సాక్షి వైద్య..

Advertisement

ఇలా సాక్షి వైద్య పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి వైద్య ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా పవన్ సినిమాకు ఈమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని ఇండస్ట్రీ సమాచారం. ఇక ఈ సినిమాని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు అధికారకంగా వెల్లడి కానున్నాయి.

Also Read; Manchu Lskshmi: మంచు లీక్స్… శ్రీనివాస మంగాపురంలో మోహన్ బాబు.. క్యారెక్టర్ లీక్ చేసిన మంచు లక్ష్మి!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×