E-Paper
Advertisement

Salaar 2: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ 2 పై కీలక అప్డేట్ ..!

Salaar 2: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ 2 పై కీలక అప్డేట్ ..!
Advertisement

Salaar 2: ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ సినిమా రెండో భాగం కోసం ప్రభాస్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా సాలార్ 2 ఆగిపోయిందని..పూర్తిగా రీడిజైన్ చేస్తున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చిన కథనం ప్రకారం, ది రాజా సాబ్ బాక్సాఫీస్ ఫలితం తర్వాత సలార్ 2 ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం పనిచేసిన ఫార్ములా ఇప్పుడు పనిచేయకపోవచ్చు.. అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి కథలో మార్పులు చేస్తున్నారని కూడా రాసారు. దీంతో సలార్ 2 ఆలస్యం అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు.

Advertisement

అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తాజాగా చిత్రబృందం గట్టి సమాధానం ఇచ్చింది. శ్రుతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా సలార్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ప్రభాస్..శ్రుతిహాసన్ కలిసి ఫోన్ చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఆ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
“సలార్ 2లో ఆద్యా దేవాకు ఏమి చూపిస్తోంది?” అంటూ పెట్టిన ఈ పోస్టు..సలార్ 2 ఖచ్చితంగా కొనసాగుతుందనే సంకేతంగా మారింది.

ఈ పోస్టు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. “చివరికి దేవా నవ్వాడు”, “ట్రైలర్ ఎప్పుడు?”, “వెరాడా – దేవా ఫైట్ చూడాలి” అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభాస్.. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య వచ్చే ఘర్షణ ఈ భాగంలో మరింత బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ 2023 డిసెంబర్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹650 కోట్ల వసూళ్లు సాధించింది. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో స్నేహితులు శత్రువులుగా.. మారే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే కథను మరింత లోతుగా చూపించేదే సలార్ 2 అని చిత్రబృందం చెబుతోంది.

ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి భారీ ప్రాజెక్ట్ స్పిరిట్..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోపక్క ప్రభాస్ హను రాఘవ పూడితో ఫౌజి సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి కూడా ఈ హీరో డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సలార్ సినిమాని కూడా త్వరలోనే ప్రభాస్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. మొత్తానికి, సలార్ 2 ఆగిపోయిందన్న వార్తలు కేవలం వదంతులేనని, ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు.

ALSO READ: Boyapati Next Film: బాలీవుడ్ స్టార్ హీరోతో బోయపాటి శ్రీను… స్క్రిప్ట్ మొత్తం సిద్ధం..!

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×