E-Paper
Advertisement

నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!

నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!
Advertisement

Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు . తాజాగా సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఎవరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన పడక గదిలో దయ్యాలు ఉండటం గురించి కూడా ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

పడకగదిలో దయ్యాలు…

ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ తో మాట్లాడుతూ..కుచ్ కుచ్ హోతా హై కథ చెప్పడానికి మొదటిసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఈయన ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవారని తెలిపారు. కరణ్ జోహార్ ఈ విషయం గురించి మాట్లాడటంతో సల్మాన్ ఖాన్ ఈ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తాను గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో తన పడకగదిలో తనతో పాటు మరొకరు ఉండేవారని ఎప్పుడు తాను ఒంటరిగా లేనని తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరో  తను ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

గదిలో వింత శబ్దాలు వచ్చేవి..

Advertisement

నా పడక గదిలో నాతో పాటు ఆ వ్యక్తి ఉంటుంది నాకు తెలియకుండానే నా గదిలో శబ్దాలు రావటం, నేను స్నానానికి వెళ్తే కబోర్డ్స్ సౌండ్ చేయటం, గది నుంచి నేను బయటకు రాగానే గదిలో లైట్స్ అవంతట అవే ఆఫ్ అయ్యేది, వింత వింత శబ్దాలు వచ్చేవి. నాకు తెలియకుండానే నా మ్యూజిక్ సిస్టంలో పాటలు ప్లే అయ్యేవని సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఎవరికి తెలియని ఈ విషయాలను బయటపెట్టారు. ఇలా నిత్యం నా పడక గదిలో నన్ను ఒకరు అనుకరిస్తూనే ఉండేవారని ఈయన తెలిపారు. అయితే అది దయ్యమా లేక మరేంటీ అనేది నాకు తెలియదని సల్మాన్ ఖాన్ తెలిపారు.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్..

ఇలా తనతో పాటు ఉన్న ఆ వ్యక్తి అమ్మాయి అయితే ఒకసారి నాకు కనపడు అంటూ నేను చెప్పేవాడినని సరదాగా అప్పటి విషయాలను సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా గెలాక్సీ అపార్ట్మెంట్లో తనతో పాటు దెయ్యం కూడా ఉండేది అంటూ ఈయన ఈ సందర్భంగా కామెంట్ చేయడంతో అభిమానులు విభిన్న రీతులో స్పందిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్  సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మాతృభూమి అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ జోడిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Also Read: నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

Related News

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

Big Stories

Advertisement
×