E-Paper
Advertisement

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!
Advertisement

Dharani Controversy: 22ఏ పై BJLP నేత మహేశ్వర రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో ధరణి, భూ భారతి మీద చర్చకు ప్రభుత్వం భయపడిందని, సభ సాక్షిగా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కొన్ని వాస్తవాలను బయట పెట్టడం జరిగిందని అన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌ను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని అన్నారు. ధరణి పోర్టల్ పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఫోరెన్సిక్ ఆడిట్‌లో..

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. భూ భారతి పేరుతో లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కాజేస్తున్నారని ఎలేటి అన్నారు. భూమి కోసం రైతాంగ పోరాటాలు కూడా జరిగాయని, గత ప్రభుత్వం సీతారాంపూర్ కి చెందిన 12 ఎకరాల దేవాదాయ భూములను tsiic కి కట్టబెట్టిందని అన్నారు. ధరణిపీస్ చేసిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటకు వచ్చిన భయంకర నిజాలను ఎందుకు బయట పెట్టడం లేదు. 23లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి బదిలీ అయ్యిందని రెవెన్యూ మంత్రి శాసనసభలో చెప్పారని అన్నారు. 23లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం అయితే ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుందని ఫైర్ అయ్యారు.

ఫాం హౌస్‌ల పంచాయతీ..

Advertisement

లక్షల కోట్ల దోపిడి జరిగిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విచారణ చేయలేదు. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు. అన్యాక్రాంతం అయిన ఎంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వీళ్ళ ఫాం హౌస్‌ల మీదకు వాళ్లు.. వాళ్ల ఫాం హౌస్ ల మీదకు వెళ్లి రాజకీయ డ్రామా ఆడారని అన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని, ధరణి, భూ భారతి అక్రమాల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. అన్యాయంగా 22 A లో చేర్చిన ప్రైవేటు భూములను విడుదల చేయాలని, అక్రమాలు నిగ్గు తేల్చే వరకు మా పోరాటం ఆగదని అన్నారు.

Also read: సాయంత్రం వేళ వేడివేడిగా ముంబై పావ్ భాజీ.. పర్ఫెక్ట్ రుచి కోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

Tags

Related News

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం!

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

చెత్త సేకణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

Big Stories

Advertisement
×