BigTV English

Samantha: మళ్లీ అడ్డంగా దొరికిన సమంత.. పండుగ పూట కూడా వదలరా?

Samantha: మళ్లీ అడ్డంగా దొరికిన సమంత.. పండుగ పూట కూడా వదలరా?
Advertisement

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సమంత (Samantha).. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడిన ఈమె.. ఆ తర్వాత క్రమ క్రమంగా కోలుకుంటూ కెరియర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అవుతోంది. ఇటు హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా తొలి అడుగులు వేసి మంచి సక్సెస్ అందుకున్న ఈమె.. ఇప్పుడు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. ఇంకొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.


దీపావళి వేళ అడ్డంగా దొరికిపోయిన సమంత..

ఇకపోతే తాజాగా దీపావళి వేడుకల్లో సందడి చేసింది సమంత. మొన్నామధ్య కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంట్లోనే సమంత దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మరొకసారి కనిపించింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ మళ్లీ అడ్డంగా దొరికిపోయిన సమంత.. కనీసం పండగ పూట కూడా ఒకరిని విడిచి ఒకరు వదిలి ఉండలేరా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికైనా స్పందిస్తారా?

ఇకపోతే గత కొంతకాలంగా రాజ్ నిడిమోరు తో హీరోయిన్ సమంత రిలేషన్ లో ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా అతడినే ఈమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. దీనికి తోడు రాజ్ భార్య శ్యామలి దే కూడా ఇన్ డైరెక్ట్ గా వీరి బంధాన్ని ఉద్దేశిస్తూ పోస్ట్లు పెడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఈ ఇద్దరు ఎక్కడా స్పందించలేదు. పైగా సమంత ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే కనిపిస్తూ రూమర్స్ ను మరింత బలం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు దీపావళి వేడుకల్లో కూడా సమంత కొత్త ఇంట్లో రాజ్ నిడిమోరు కనిపించేసరికి ఈ వార్తలు మరింత వేగంగా పాకిపోతున్నాయి. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.


సమంత కెరియర్..

సమంత కెరీయర్ విషయానికి వస్తే.. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించిన ఈమె.. ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్ పై మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అలాగే మరొకవైపు ఓ బేబీతో తనకు మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ నందిని రెడ్డితో ఒక సినిమా చేస్తోంది. అదే ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా కూడా ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లో వస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటిస్తోంది.. అంతేకాదు కోలీవుడ్లో ప్రముఖ హీరో శింబుతో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ:Renu Desai: సన్యాసిగా రేణూ దేశాయ్.. కఠిన నిర్ణయం వెనుక కారణం? 

 

Related News

Tollywood Hero : నీకు కాదు.. నాకు నచ్చినట్టు సినిమా చేయు… డైరెక్టర్‌ని ఫోర్స్ చేస్తున్న హీరో ?

Rashmika: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన రష్మిక.. నరకం అనుభవించానంటూ?

Vishal: ఆ డైరెక్టర్ తో గొడవలు నిజమే.. విశాల్ అదిరిపోయే రియాక్షన్!

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Big Stories

×