BigTV English

Renu Desai: సన్యాసిగా రేణూ దేశాయ్.. కఠిన నిర్ణయం వెనుక కారణం?

Renu Desai: సన్యాసిగా రేణూ దేశాయ్.. కఠిన నిర్ణయం వెనుక కారణం?
Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు సొంతం చేసుకుంది రేణూ దేశాయ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలు చేయడమే కాకుండా ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసిన ఈమె పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు ఇద్దరిని తీసుకొని ముంబైలో సెటిలైపోయింది. అక్కడే పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ సాగిస్తున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు జంతు ప్రేమికురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె.. కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా మూగజీవులకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.


సన్యాసిగా రేణు దేశాయ్..

అటు కరోనా సమయంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచింది రేణు దేశాయ్. ఇదిలా ఉండగా ఎవరైనా సరే విడాకులు తీసుకున్న తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని చూస్తారు. అందులో భాగంగానే ఒక తోడును కూడా వెతుక్కుంటారు. అందరిలాగా రేణు దేశాయ్ కూడా ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల దాటికి తట్టుకోలేక ఆమె నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఇప్పటికే ఎన్నిసార్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఆధ్య పెద్దదైపోయింది. రెండో పెళ్లి ఆలోచన ఉందంటూ కామెంట్లు చేసిన ఈమె.. సడన్ గా సన్యాసిగా మారబోతున్నాను అంటూ చేసిన కామెంట్లు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఇక ఒక సంవత్సరం మాత్రమే తర్వాత సన్యాసం పుచ్చుకుంటాను అని తెలిపింది. మరి రేణు దేశాయ్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఏడాది మాత్రమే ఉంటాను అంటూ..

ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. పలు రకాల విషయాలపై చర్చిస్తున్న రేణూ దేశాయ్ తాజాగా తాను సన్యాసం స్వీకరించడం పై కామెంట్లు చేసింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ..” త్వరలో నేను సన్యాసం తీసుకుంటున్నాను. ఒక సంవత్సరం మాత్రమే ఉంటాను. ఆ తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతాను” అంటూ తెలిపింది. అయితే రేణు దేశాయ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో తెలియదు.


సన్యాసం పుచ్చుకోవడం పై పలు రకాల కామెంట్లు..

కానీ ఇప్పుడు మాత్రం కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే చాలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తాను వదిలేయలేదని.. తననే పవన్ కళ్యాణ్ వదిలేసాడు అని ఎన్నిసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వినడం లేదట.. ఇక వీటి దాటికి తట్టుకోలేక ఆమె సన్యాసం తీసుకుంటుంది అంటూ కొంతమంది కామెంట్ లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో తెలియదు కానీ రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవడంపై ఇప్పుడు పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ: Bigg Boss 9 Promo: తనూజ దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్.. గట్టిగా ఇచ్చిందిగా!

Related News

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Ram Pothineni: అప్పుడు రామ్ చరణ్ ని చూస్తే జాలేసింది.. రామ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: రామ్ చరణ్ సెంటిమెంట్ మంత్, పెద్ది రిలీజ్ డేట్ కూడా కారణం అదేనా?

Mass Jathara : అర్థం పర్థం లేని పాటను రిలీజ్ చేసిన మాస్ జాతర యూనిట్

Actor Shivaji: సుధీర్ కి విలన్ గా శివాజీ.. మంగపతిని మించిన పాత్ర ఇది, ఇక వెండితెరపై రచ్చే

Allu Shirish: కాబోయే భార్యతో అల్లు శిరీష్ దీపావళి సెలబ్రేషన్స్…ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘.. దీపావలి పోస్టర్ చూశారా?

Big Stories

×